Nia raids: ఇద్దరు లష్కరే ముస్తఫా ఉగ్రవాదుల అరెస్ట్

ABN , First Publish Date - 2021-07-23T12:42:25+05:30 IST

దేశంలో ఉగ్రవాద దాడికి కుట్ర పన్నిన ఇద్దరు లష్కరే ముస్తఫా సంస్థకు చెందిన ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది....

Nia raids: ఇద్దరు లష్కరే ముస్తఫా ఉగ్రవాదుల అరెస్ట్

 న్యూఢిల్లీ : దేశంలో ఉగ్రవాద దాడికి కుట్ర పన్నిన ఇద్దరు లష్కరే ముస్తఫా సంస్థకు చెందిన ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. జమ్మూకశ్మీరులో ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర పన్నిన లష్కరే ముస్తఫా సంస్థకు చెందిన ఉగ్రవాదులు అర్మాన్ అలీ, ఎహ్సానుల్లాలను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. బీహార్ రాష్ట్రంలో అర్మాన్ అలీని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసి బీహార్ చీఫ్ జ్యుడిషీయల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. మరో ఉగ్రవాది ఎహ్సానుల్లాను జమ్మూలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరు పర్చి రిమాండుకు తరలించారు.జమ్మూలో ఉగ్రవాద కార్యకలాపాలకు జైషే మహ్మద్ సభ్యులతో కలిసి వీరు కుట్ర పన్నారని ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. బీహార్ నుంచి మొహాలీకి రెండు తుపాకులు, మందుగుండు సామాగ్రిని ఈ ఉగ్రవాదులు రవాణ చేశారని దర్యాప్తులో తేలింది. వీరు ఈ తుపాకులను జమ్మూకశ్మీరులోని స్వయం ప్రకటిత కమాండర్ హిదయత్ ఉల్లా మాలిక్ కు అందించారని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. 


Updated Date - 2021-07-23T12:42:25+05:30 IST