జమ్మూ కశ్మీరులో ఎన్ఐఏ దాడులు

ABN , First Publish Date - 2020-10-28T16:37:15+05:30 IST

హవాలా రాకెట్, నిధుల దుర్వినియోగం, ఉగ్రవాదులకు నిధులు అందించారనే ఆరోపణలపై నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) బుధవారం....

జమ్మూ కశ్మీరులో ఎన్ఐఏ దాడులు

శ్రీనగర్ (జమ్మూకశ్మీర్): హవాలా రాకెట్, నిధుల దుర్వినియోగం, ఉగ్రవాదులకు నిధులు అందించారనే ఆరోపణలపై నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) బుధవారం దాడులు చేసింది. శ్రీనగర్ తో పాటు గ్రేటర్ కశ్మీర్ న్యూస్ పేపర్ కార్యాలయంచ మానవహక్కుల యాక్టివిస్టు ఖుర్రం పర్వేజ్ ఇళ్లపై ఎన్ఐఏ అధికారులు దాడులు  చేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ హవాలా రాకెట్ ద్వారా నిధులు తీసుకువచ్చి ఉగ్రవాదులకుఅందజేసిందనే ఆరోపణలపై ఎన్ఐఏ ఆకస్మిక దాడులు చేసింది.2016లో శ్రీనగర్ లో ఖుర్రం పర్వేజ్ ను ఎన్ఐఏ అధికారులు అరెస్టుచేశారు. అప్పట్లో 76 రోజుల పాటు నిర్బంధంలో ఉన్న ఖుర్రంను కోర్టు ఉత్తర్వులతో పబ్లిక్ సేఫ్టీ కింద మళ్లీ అరెస్టు చేశారు. శ్రీనగర్, బందిపొరా, బెంగళూరునగరాల్లోని పలు ఇళ్లతోపాటు గ్రేటర్ కశ్మీర్ ట్రస్టు కార్యాలయంలోనూ ఎన్ఐఏ అధికారులు దాడి చేసి తనిఖీుల చేశారు. 

Updated Date - 2020-10-28T16:37:15+05:30 IST