Sep 24 2021 @ 13:02PM

కంగనా సినిమాలో నటించేందుకు వెళ్లి ‘టైం వేస్ట్‘ చేసుకున్నా....

నియా శర్మ... బుల్లితెరపై తళుక్కుమన్న బోల్డ్ బ్యూటీ. అయితే, ఈమె గ్లామర్ షోలో మాత్రమే బోల్డ్ కాదు. మాటల్లోనూ బోల్డంత బోల్డ్! తాజాగా, కంగనా స్టారర్ బయోపిక్ ‘మణికర్ణిక‘ గురించి నియా గుర్తు చేసుకుంది. ‘ఆ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించేందుకు వెళ్లి అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నా’’నంటూ సూటిగా చెప్పేసింది. సాధారణంగా బాలీవుడ్ బ్యూటీస్ ఇటువంటి విషయాలు బయటపెట్టరు. కానీ, నియా శర్మ ఉన్నది ఉన్నట్టు కుండ బద్ధలు కొట్టింది.


కంగనా టైటిల్ రోల్‌లో ‘మణికర్ణిక‘ తెరకెక్కుతుండగా నియా ఒక చిన్న పాత్ర కోసం క్యాస్టింగ్ మీట్‌కు అటెండ్ అయ్యిందట. అక్కడున్నాయన చాలా సేపు సోది చెప్పాడట, కానీ, క్యారెక్టర్ మాత్రం ఇవ్వలేదట. చివర్లో ‘‘సదరు పాత్రకి నువ్వు చాలా హాట్‌గా అయిపోతావనిపిస్తోంది!’’ అన్నాడట. అసలు తాను అక్కడికి వెళ్లటమే పెద్ద సమయం దండగా అంటోంది నియా.


టీవీ తెరపైన, వీడియో ఆల్బమ్స్ ద్వారా ఇంటర్నెట్‌లోనూ నియా శర్మ కలకలం రేపుతోంది. ఆమె హాట్ సాంగ్స్ కుర్రాళ్లలో బాగా పాప్యులర్. అయితే, ఇంత వరకూ నియా శర్మకి బాలీవుడ్‌లో బిగ్ బ్రేక్ మాత్రం రాలేదు. అందుకే, చాలా చిరాగ్గా ఉన్న ఈ చిన్నది స్టార్ కిడ్స్‌ను కూడా టార్గెట్ చేసింది. బాలీవుడ్‌లోకి వస్తోన్న వారసులు అందం, టాలెంట్‌తో ఆకట్టుకోవటం లేదని తేల్చేసింది. వారి ఇంటి పేర్లు పక్కన పెడితే ఎవ్వరూ వాళ్లని రెండోసారి చూడరంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. చూడాలి మరి, ఈ హాట్ ఐటెం బాంబ్ బాలీవుడ్ బిగ్ స్క్రీన్‌పై ఎప్పుడు ఆటంబాంబులా పేలుతుందో...