Abn logo
Oct 17 2021 @ 19:33PM

ఈ క్రెడిట్ కార్డు భేష్

హైదరాబాద్ : కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఓకార్డు అందుబాటులో ఉంది. దీని ద్వారా పలు  ప్రయోజనాలను పొందొచ్చు.  దీని పేరు బజాజ్ ఫిన్‌సర్వ్ ఆర్‌బీఎల్ బ్యాంక్ వరల్డ్ ప్లస్ సూపర్ కార్డు. దీని వల్ల పలు ప్రయోజనాలు పొందొచ్చు. ఆర్‌బీఎల్ బ్యాంక్...  బజాజ్ ఫిన్‌సర్వ్ భాగస్వామ్యంతో ఈ క్రెడిట్ కార్డులు తీసుకువచ్చింది. ఈ కార్డు తీసుకోవడం వల్ల పలు ప్రయోజనాలు పొందొచ్చు. క్రెడిట్, క్యాష్, లోన్, ఈఎంఐ వంటి నాలుగు రకాల ప్రయోజనాలను  పొందొచ్చు.


ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ కార్డు ఉంటే  వారు రూ. 3 వేలకు పైగా లావాదేవీలను ఈఎంఐ రూపంలోకి మార్చుకోవచ్చు. అలాగే ఈ కార్డుదారులు పర్సనల్ లోన్లు కూడా పొందొచ్చు. కార్డు క్యాష్ లిమిట్ ప్రాతిపదికన లోన్ మొత్తం ఆధారపడి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 2.5 శాతం ఉంటుంది. వడ్డీ ఉండదు. అలాగే ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవచ్చు. యాభై రోజుల వరకు వడ్డీ ఉండబోదు. చార్జీలు మాత్రం ఉంటాయి. ఈ కార్డుపై స్పెషల్ డిస్కౌంట్లు కూడా ఉంటాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ లేదా ఆర్‌బీఎల్ బ్యాంక్ వెబ్‌‌సైట్‌కు వెళ్లి కార్డు కోసం దరఖాస్తు  చేసుకోవచ్చు. కార్డు ఫీజు రూ. 4,999.