Oct 23 2021 @ 21:40PM

‘నిధి’ కోసం నెటిజన్ల ఆరాటం

పుష్కలమైన అందాలతో టాలీవుడ్, కోలీవుడ్‌లో అవకాశాలు పట్టేస్తోంది హీరోయిన్‌ నిధి అగర్వాల్‌. టాలీవుడ్‌లో స్టార్ హీరోల చిత్రాలలో మెప్పిస్తోన్న ఈ భామ కోలీవుడ్‌లో హీరో జయం రవితో కలిసి ‘భూమి’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత శింబుతో కలిసి ‘ఈశ్వరన్‌’ చిత్రంలో నటించింది. ఇందులో ఆమె అందాలకు యూత్‌ ఫిదా అయింది. అప్పటి నుంచి ఆమె ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఏకంగా పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ సరసన నటించే చాన్స్‌ దక్కించుకోవడంతో ఆమె క్రేజ్ మాములుగా లేదు. అలాగే, సోషల్‌ మీడియాలో నెటిజన్స్‌ ఫాలోయింగ్‌ కూడా ఆమెకు గణనీయంగా పెరుగుతోంది. 


తాజా వివరాల మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో నిధి అగర్వాల్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య 1.3 కోట్లకు చేరుకుంది. ఇది మరింత పెంచుకునేందుకు నిధి అగర్వాల్‌ గ్లామరస్‌గా ప్రత్యేక ఫొటో షూట్‌లు నిర్వహించి ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తోంది. ఈ ఫొటోలు పోస్ట్ అయిన కొద్దిసేపటికే వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఆమె పోస్ట్‌ చేసిన ఫొటోలను చూసిన నెటిజన్లు ‘నిధి’ అందాలు సూపర్బ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.


Cinema Newsమరిన్ని...