Abn logo
Sep 29 2020 @ 13:04PM

ఓటీటీలో సినిమా ‌.. పాపం ఇస్మార్ట్‌ బ్యూటీ!

Kaakateeya

కోవిడ్‌ ఎఫెక్ట్‌ సినీ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా ప్రభావాన్నే చూపిస్తోంది. లాక్‌డౌన్‌లో షూటింగ్స్‌ ఆగిపోయాయి.. అయితే ఆరు నెలల తర్వాత విధి విధానాలతో ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. అయితే లాక్‌డౌన్‌లో మూతపడ్డ థియేటర్స్‌ విషయంలో ఇంకా నిర్ణయం వెలువడకపోవడంతో ఇన్ని రోజులు వెయిట్‌ చేసిన మన మేకర్స్‌ సినిమాలను ఓటీటీ మాధ్యమాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కోలీవుడ్‌లో జయం రవి హీరోగా నటించిన 25వ చిత్రం 'భూమి' ఓటీటీలో విడుదలవుతుంది. ఈ సినిమా థియేటర్‌ విడుదల కోసం దర్శక నిర్మాతలు, హీరో జయం రవితో పాటు హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ చాలా ఆశగా ఇన్ని రోజులూ ఎదురుచూశారు. ముఖ్యంగా ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ 'భూమి' సినిమాపై చాలా ఆశలను పెట్టుకుంది. ఎందుకంటే ఈమె నటించిన తొలి తమిళ చిత్రమిది. చేతిలో అంతంత మాత్రమే అవకాశాలున్న తరుణంలో 'భూమి' సినిమాతో కోలీవుడ్‌లో పాగా వేద్దామనుకుంది నిధి. అయితే సినిమా ఓటీటీలోనే విడుదలవుతుంది. ఈ విషయంలో ఆమె చేసేదేమీ లేదు. 'భూమి' విషయంలో అనుకున్నదొకటైతే అయ్యిందొకటంటూ.. నిధి అగర్వాల్‌ అసంతృప్తిగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 


Advertisement
Advertisement
Advertisement