Oct 21 2021 @ 09:33AM

Nidhii Agerwal: ఇస్మార్ట్ బ్యూటీకి నో లిమిట్స్..!

'మున్నా మైఖేల్' చిత్రంతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన హైదరబాదీ అమ్మాయి నిధి అగర్వాల్..ఆ తర్వాత తెలుగులో అక్కినేని సోదరులతో బ్యాక్ టు బ్యాక్ 'సవ్యసాచి', 'మిస్టర్ మజ్ను' సినిమాలలో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సాలీడ్ హిట్ అందుకుంది. దాంతో అటు తమిళం, ఇటు తెలుగు సినిమాలలో వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే గల్లా అశోక్ డెబ్యూ మూవీ 'హీరో'లోనూ ఆమెనే హీరోయిన్. 

వీరమల్లు గనక బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే ఇక నిధికి టాలీవుడ్‌లో తిరుగుండదంటున్నారు. ఇలా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో యూత్‌కి వేడి పుట్టిస్తోంది. తాజాగా ఇలాంటి ఆమె లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్స్..ఇస్మార్ట్ బ్యూటీ ఇచ్చే గ్లామర్ ట్రీట్‌కి నో లిమిట్స్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారట. మొత్తానికి ఇటు సౌత్‌లో అటు నార్త్‌లో మరిన్ని అవకాశాలను అందుకోవడానికే ఇలాంటి గ్లామర్ పిక్స్ షేర్ చేస్తుందని తెలుస్తోంది.