నిరోధ స్థాయిలు 10850, 11000 -టెక్‌ వ్యూ

ABN , First Publish Date - 2020-07-13T06:04:12+05:30 IST

నిఫ్టీ గత వారం 10800 వరకు వెళ్లి మైనర్‌ కరెక్షన్‌లో పడినా చివరికి 160 పాయింట్ల లాభంతో ముగిసింది. వారం మొత్తం మీద గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల నడుమ కదలాడింది. ఇది అనిశ్చిత ట్రెండ్‌ సంకేతం...

నిరోధ స్థాయిలు 10850, 11000  -టెక్‌ వ్యూ

నిఫ్టీ గత వారం 10800 వరకు వెళ్లి మైనర్‌ కరెక్షన్‌లో పడినా చివరికి 160 పాయింట్ల లాభంతో ముగిసింది. వారం మొత్తం మీద గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల నడుమ కదలాడింది. ఇది అనిశ్చిత ట్రెండ్‌ సంకేతం. కొద్ది రోజులుగా  అప్రమత్తంగా పైకి కదులుతోంది. అప్‌ట్రెండ్‌ మందగించింది. ఇప్పుడు ప్రధాన మానసిక అవధి 11000 చేరువ అవుతూ ఉండడం వల్ల స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తం కావాలి. గత నాలుగు వారాల్లో 1000 పాయింట్ల ర్యాలీ సాధించినందు వల్ల స్వల్పకాలిక ఓవర్‌బాట్‌ స్థితి ఏర్పడింది. 10850 వద్ద మైనర్‌ నిరోధం ఏర్పడింది. 


బుల్లిష్‌ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్‌ కోసం 10850 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 11000. ఇక్కడ కన్సాలిడేట్‌ కావచ్చు.

బేరిష్‌ స్థాయిలు: కీలక స్థాయి 10800 వద్ద విఫలమైతే కరెక్షన్‌ ముప్పు ఏర్పడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 10500. ట్రెండ్‌లో సానుకూలత నిలబెట్టుకోవాలంటే ఇక్కడ బలంగా కన్సాలిడేట్‌ కావాలి. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక కరెక్షన్‌లో ప్రవేశిస్తుంది. 

బ్యాంక్‌ నిఫ్టీ: మరింత అప్‌ట్రెండ్‌ కోసం గరిష్ఠ నిరోధం 22700 కన్నా పైన బలంగా నిలదొక్కుకోవాలి. మరో ప్రధాన నిరోధం 23100.

పాటర్న్‌: ‘‘ఏటవాలుగా ఎగువకు ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిరోధం ఎదురవుతోంది. ప్రస్తుతం ‘‘ఏటవాలుగా ఎగువకు ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా స్వల్పంగా పైన ఉంది. ఈ రేఖ కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత తప్పదు. 10500 వద్ద ‘‘అడ్డంగా కనిపిస్తున్న సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా దిగజారితే బ్రేక్‌డౌన్‌ హెచ్చరికగా భావించాలి. 

టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి రివర్సల్‌ ఉంది. 


సోమవారం స్థాయిలు

నిరోధం : 10810, 10860  

మద్దతు : 10700, 10650


Updated Date - 2020-07-13T06:04:12+05:30 IST