ప్రధాన నిరోధం 15050 -టెక్‌ వ్యూ

ABN , First Publish Date - 2021-05-10T06:57:57+05:30 IST

నిఫ్టీ గత వారం బలమైన కరెక్షన్‌తో ప్రారంభమెనా కీలక స్థాయి 14400 వద్ద రికవరీ సాధించి నిలకడగా పురోగమిస్తూ చివరికి 14800 స్థాయిలో క్లోజయింది. కన్సాలిడేషన్‌, అప్రమత్త ట్రెండ్‌ అనంతరం చివరికి నిలకడగా క్లోజ్‌ కావడం విశేషం...

ప్రధాన నిరోధం 15050  -టెక్‌ వ్యూ

నిఫ్టీ గత వారం బలమైన కరెక్షన్‌తో ప్రారంభమెనా కీలక స్థాయి 14400 వద్ద రికవరీ సాధించి నిలకడగా పురోగమిస్తూ చివరికి 14800 స్థాయిలో క్లోజయింది. కన్సాలిడేషన్‌, అప్రమత్త ట్రెండ్‌ అనంతరం చివరికి నిలకడగా క్లోజ్‌ కావడం విశేషం. వీక్లీ చార్టుల్లో వారం గరిష్ఠ స్థాయిలో క్లోజ్‌ కావడం కొనుగోళ్ల మద్దతును సూచిస్తోంది. అలాగే ఈ చార్టుల్లో ఎగువకు రివర్సల్‌ బార్‌ పాటర్న్‌ సాధించి గత వారం కన్నా 200 పాయింట్లకు పైగా లాభంతో ముగియడం సానుకూల సంకేతం. మొత్తం మీద మార్కెట్‌ తక్షణ డౌన్‌ట్రెండ్‌ను నివారించుకుంది. మూడు నెలల కరెక్షన్‌ అనంతరం గత వారంలో ప్రధాన మద్దతు స్థాయిలో బౌన్స్‌బ్యాక్‌ సాధించడం టెక్నికల్‌ రివర్సల్‌ ఏర్పడిందనేందుకు సంకేతం. కాని ఇప్పటికీ కీలక స్వల్పకాలిక నిరోధం 15000 కన్నా దిగువనే ఉంది. మరోసారి ఈ స్థాయిలో పరీక్ష ఎదురు కానుంది. అప్‌ట్రెండ్‌ను మరింతగా కొనసాగించాలంటే ఇక్కడ తప్పనిసరిగా నిలదొక్కుకోవాలి. 


బుల్లిష్‌ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్‌ కోసం గతంలో ఏర్పడిన గరిష్ఠ స్థాయి, ప్రధాన నిరోధం 14960 కన్నా పైన నిలదొకుకోఓవవాలి. మరో ప్రధాన నిరోధం 15050. ఆ పైన మాత్రమే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ ఆస్కారం ఉంటుంది.

బేరిష్‌ స్థాయిలు: కరెక్షన్‌లో పడి ప్రధాన మద్దతు స్థాయి 14700 కన్నా దిగజారితే తిరిగి స్వల్పకాలిక కరెక్షన్‌లో ప్రవేశిస్తుంది. ఇన్వెస్టర్లు అప్రమత్తం కావాలి. ఇతర ప్రధాన మద్దతు స్థాయిలు 14400, 14000.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచి గత వారం మైనర్‌ రికవరీ సాధించి వారం గరిష్ఠ స్థాయికి చేరువలో క్లోజయింది. ఇది పాజిటివ్‌ ట్రెండ్‌ సంకేతం. మరోసారి స్వల్పకాలిక నిరోధం 34000 వద్ద పరీక్ష ఎదుర్కొనబోతోంది. ఆ పైన నిలదొక్కుకున్నప్పుడే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ ఏర్పడుతుందది. 

పాటర్న్‌: గత వారం 50, 100 డిఎంఏల కన్నా పైన రికవరీ సాధించింది. 15050 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద బ్రేకౌట్‌ సాధిస్తే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ చాన్స్‌ ఉంటుంది. అలాగే 15050 వద్ద ఏర్పడిన ‘‘డబుల్‌ టాప్‌’’ పాటర్న్‌ను కూడా ఛేదించాలి. గత వారం ‘‘ఏటవాలుగా దిగువకు ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ పైకి రావడం సానుకూల సంకేతం. 


టైమ్‌: ఈ సూచి ప్రకారం మంగళ, శుక్ర వారాల్లో తదుపరి రివర్సల్స్‌ ఉన్నాయి. 


సోమవారం స్థాయిలు

నిరోధం : 14960, 15010 

మద్దతు : 14840, 14780

Updated Date - 2021-05-10T06:57:57+05:30 IST