14500 ఎగువన నిలదొక్కుకుంటేనే.. టెక్‌ వ్యూ

ABN , First Publish Date - 2021-03-01T06:43:02+05:30 IST

నిఫ్టీ గత వారం ఆరంభంలో మైనర్‌ అప్‌ట్రెండ్‌ను కనబరిచి 15000 మార్కు ను అధిగమించింది. వారాంతంలో బేరిష్‌ సెంటిమెంట్‌ను సూచిస్తూ దాదా పు 600 పాయింట్లు నష్టపోయి వారం కనిష్ఠ స్థాయిల్లో క్లోజైంది...

14500 ఎగువన నిలదొక్కుకుంటేనే..  టెక్‌ వ్యూ

నిఫ్టీ గత వారం ఆరంభంలో మైనర్‌ అప్‌ట్రెండ్‌ను కనబరిచి 15000 మార్కు ను అధిగమించింది. వారాంతంలో బేరిష్‌ సెంటిమెంట్‌ను సూచిస్తూ దాదా పు 600 పాయింట్లు నష్టపోయి వారం కనిష్ఠ స్థాయిల్లో క్లోజైంది. అంతేకాకుండా డౌన్‌వర్డ్‌ రివర్సల్‌ బార్‌ ప్యాట్రన్‌లోకి జారుకోవటంతో తదుపరి కరెక్షన్‌ను సూచిస్తోంది. టెక్నికల్‌గా మార్కె ట్‌ స్వల్పకాలిక కరెక్షన్‌లో సాగుతుండటంతో సత్వర బుల్లిష్‌ ట్రెండ్‌కు బ్రేక్‌ పడింది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి.


స్వల్పకాలిక మద్దతు స్థాయిలు 14450-14500గా ఉన్నాయి. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌కు ఇక్కడ కచ్చితంగా రికవరీ కావాల్సి ఉంటుంది. 

బుల్లిష్‌ స్థాయిలు: అప్‌ట్రెండ్‌ కోసం 14450-14500 వద్ద బలంగా కన్సాలిడేట్‌ కావాల్సి ఉంటుంది. ఒకవేళ సానుకూల ట్రెండ్‌ను కనబరిస్తే 14700 ఎగువన నిరోధం ఉంటుంది. ఇక్కడ నిలదొక్కుకుంటేనే అప్‌ట్రెండ్‌కు అవకాశాలుంటాయి. 

బేరిష్‌ స్థాయిలు: బలహీనతను కనబరిస్తే 14450 దిగువన మద్దతు స్థాయిలుంటాయి. ఇక్కడ రక్షణ కోసం కచ్చితంగా రికవరీ కావాల్సి ఉంటుంది. స్వల్పకాలిక కరెక్షన్‌ను సూచిస్తే 14300 దిగువన మద్దతు స్థాయిలుంటాయి.  

బ్యాంక్‌ నిఫ్టీ: సానుకూల ట్రెండ్‌ను కనబరిస్తే 35200 ఎగువన నిరోధ స్థాయిలుంటాయి. అప్‌ట్రెండ్‌ కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. తదుపరి నిరోధ స్థాయిలు 35600, 36000. ఒకవేళ బలహీతను కనబరిస్తే 34600 దిగువన మద్దతు స్థాయిలుంటాయి.

పాటర్న్‌: 14700 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద గట్టి నిరోధం ఉంది. మార్కెట్‌ ఈ స్థాయిలకన్నా దిగువనే ఉండటంతో సత్వర బుల్లిష్‌ ట్రెండ్‌ అవకాశాలను సూచించటం లేదు. 14450 వద్ద ‘‘ దిగువకు కనిపిస్తున్న సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా కిందకు చేరితే స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది.  

టైమ్‌: ఈ సూచీ ప్రకారం మంగళ వారం స్వల్ప రివర్సల్‌కు అవకాశం ఉంది. 



సోమవారం స్థాయిలు

నిరోధం : 14620, 14700 

మద్దతు : 14450, 14370


వి. సుందర్‌ రాజా

Updated Date - 2021-03-01T06:43:02+05:30 IST