13000 వద్ద నిరోధం -టెక్ వ్యూ

ABN , First Publish Date - 2020-11-23T06:41:33+05:30 IST

నిఫ్టీ గత వారం మైనర్‌ అప్‌ట్రెండ్‌తో ప్రారంభమై కీలక స్థాయిలైన 13000కు చేరువకు వెళ్లింది. తదుపరి స్వల్ప రియాక్షన్‌, రికవరీ కనబరుస్తూ చివరకు నిలకడగా క్లోజైంది...

13000 వద్ద నిరోధం -టెక్ వ్యూ

నిఫ్టీ గత వారం మైనర్‌ అప్‌ట్రెండ్‌తో ప్రారంభమై కీలక స్థాయిలైన 13000కు చేరువకు వెళ్లింది. తదుపరి స్వల్ప రియాక్షన్‌, రికవరీ కనబరుస్తూ చివరకు నిలకడగా క్లోజైంది. వీక్లీ చార్టుల ప్రకారం చూస్తే గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల వద్ద కదలాడుతూ సైడ్‌వేస్‌ ధోరణి, కన్సాలిడేషన్‌ ట్రెండ్‌ను కనబరిచింది. గడచిన మూడు వారాల్లో నిఫ్టీ 1500 పాయింట్లు  పెరిగింది. గత వారం నిఫ్టీ పుల్‌ బ్యాక్‌ రియాక్షన్‌ను చవిచూసినప్పటికీ టెక్నికల్‌గా ట్రెండ్‌ పొజిషన్‌లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. ఆర్‌ఎ్‌సఐ ఇంకా ఓవర్‌బాట్‌ పొజిషన్‌లో కొనసాగుతుండటంతో ట్రేడర్లు గరిష్ఠ స్థాయిల వద్ద అప్రమత్తంగా వ్యవహరించటం మంచిది. నిఫ్టీ 13000 వద్ద రెండోసారి గట్టి పరీక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటం మంచిది. కొద్ది రోజుల పాటు ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకుంటే అప్‌ట్రెండ్‌ను కనబరుస్తుందా లేదా అనేది తెలుస్తుంది. 


బుల్లిష్‌ స్థాయిలు: అప్‌ట్రెండ్‌ను కనబరిస్తే 12940 వద్ద తదుపరి నిరోధ స్థాయిలుంటాయి. తదుపరి నిరోధ, టార్గెట్‌ స్థాయి 13000. ఇది స్వల్పకాలిక నిరోధ స్థాయి. ఇక్కడ నిలదొక్కుకుంటే అప్‌ట్రెండ్‌ను సూచిస్తుంది.  

బేరిష్‌ స్థాయిలు: రియాక్షన్‌ కనబరిస్తే 12700 దిగువన మైనర్‌ మద్దతు స్థాయిలుంటాయి. ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే మరింత బలహీనతను సూచిస్తుంది. తదుపరి స్వల్పకాలిక మద్దతు స్థాయిలు 12450-12500 మధ్యన ఉంటాయి. 

బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం 1000 పాయింట్ల మేర దూసుకుపోయిన ఈ సూచీ 29600 ఎగువన నిలదొక్కుకుంటే అప్‌ట్రెండ్‌ను కనబరుస్తుంది. తదుపరి నిరోధ స్థాయి 30000.

పాటర్న్‌: 13000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద గట్టి నిరోధం, 12700 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద గట్టి మద్దతు ఉన్నాయి. మద్దతు స్థాయి వద్ద నిలదొక్కుకోలేకపోతే స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. 

టైమ్‌: ఈ సూచీ ప్రకారం సోమవారం తదుపరి రివర్సల్‌ ఉంటుంది.


సోమవారం స్థాయిలు

నిరోధం : 12900, 12940 

మద్దతు : 12800, 12760


Updated Date - 2020-11-23T06:41:33+05:30 IST