Abn logo
Apr 8 2020 @ 19:32PM

చిరంజీవి సినిమాలో మరోసారి..!

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’ షూటింగ్ క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో తాత్కాలికంగా ఆగింది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో మెగాబ్ర‌ద‌ర్ త‌న‌య నిహారిక కొణిదెల అతిథి పాత్ర‌లో న‌టిస్తుంద‌ట‌. చిరంజీవి 151వ చిత్రం ‘సైరా న‌ర‌సింహారెడ్డి’లోనూ నిహారిక ఓ చిన్న‌పాత్ర‌లో న‌టించారు. ‘ఆచార్య‌’ చిత్రాన్ని ఆగస్ట్ 14న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. అయితే క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో షూటింగ్ ఆగ‌డంతో సినిమా విడుద‌ల వాయిదా పడే అవ‌కాశం ఉంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారు.

Advertisement
Advertisement
Advertisement