నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్‌, డ్రైవర్‌

ABN , First Publish Date - 2020-12-03T04:25:54+05:30 IST

నారాయణపేట ఆ ర్టీసీ డ్రైవర్‌, కండక్టర్‌ తమ నిజాయితీ చాటుకున్నారు. బుధ వారం చంద్రకళ అనే మహిళ నారాయణపేట మండలం జా జాపూర్‌ గ్రామంలో ఓ వివాహా వేడుకలో పాల్గొనేందుకు కోస్గిలో బస్సు ఎక్కింది.

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్‌, డ్రైవర్‌
పర్సును మహిళకు అప్పగిస్తున్న ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టరు

నారాయణపేట  క్రైం, డిసెంబరు 2 : నారాయణపేట ఆ ర్టీసీ డ్రైవర్‌, కండక్టర్‌ తమ నిజాయితీ చాటుకున్నారు. బుధ వారం చంద్రకళ అనే మహిళ నారాయణపేట మండలం జా జాపూర్‌ గ్రామంలో ఓ వివాహా వేడుకలో పాల్గొనేందుకు కోస్గిలో బస్సు ఎక్కింది. అయితే తొందరలో తన పర్సును బ స్సులో జార విడుచుకుంది. అందులో బంగారు వస్తువుతో పాటు ఐడీకార్డులు ఉండడం కండక్టర్‌ గమనించారు. వెంటనే బాధిత మహిళకు ఐడీకార్డులోని సెల్‌నంబర్‌ ఆధారంగా ఫోన్‌ చేసి సమాచారం అందించారు. నారాయణపేట ఎస్‌ఐ చంద్రమోహన్‌, కానిస్టేబుల్‌ బాల్‌రాజ్‌ సమక్షంలో పర్సును   చంద్రకళకు అప్పగించి కండక్టర్‌, డ్రైవర్‌ తమ నిజాయితీని చాటుకున్నారు.  

Updated Date - 2020-12-03T04:25:54+05:30 IST