గుజరాత్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. కొత్త స్పీకర్‌గా నిమాబెన్ ఆచార్య

ABN , First Publish Date - 2021-09-16T21:17:21+05:30 IST

గుజరాత్ కొత్త కేబినెట్ నేడు ప్రమాణ స్వీకారం చేసింది. నరేష్‌భాయ్ పటేల్, హర్ష సంఘ్వి, మనీషా వకీల్

గుజరాత్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. కొత్త స్పీకర్‌గా నిమాబెన్ ఆచార్య

గాంధీనగర్: గుజరాత్ కొత్త కేబినెట్ నేడు ప్రమాణ స్వీకారం చేసింది. నరేష్‌భాయ్ పటేల్, హర్ష్ సంఘ్వి, మనీషా వకీల్, కిరీట్‌సిన్హ్ జీతూభా రాణా తదితరులు మంత్రులుగా ప్రమీణస్వీకారం చేశారు. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో నేడు వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. భుజ్ ఎమ్మెల్యే నిమాబెన్ ఆచార్య గుజరాత్ కొత్త స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందు రాజీనామా చేసిన స్పీకర్ రాజేంద్ర త్రివేదీకి కొత్త ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కేబినెట్‌లో చోటు దక్కింది. 


నేడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో.. మాజీ స్పీకర్ రాజేంద్ర త్రివేది, భావ్‌నగర్ పాచిమ్ ఎమ్మెల్యే జితు వఘాని, సూరత్ పశ్చిమ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ, విస్‌నగర్ ఎమ్మెల్యే రిషికేష్ పటేల్, జామ్‌నగర్ రూరల్ ఎమ్మెల్యే రాఘవ్‌జీ పటేల్, పెర్డి ఎమ్మెల్యే కానుభాయ్ దేసి, లింబ్డి ఎమ్మెల్యే కిరీట్ సిన్హ్ జీతూభా రాణా, గాందేవీ ఎమ్మెల్యే నరేష్ భాయ్ పటేల్, అసర్వా ఎమ్మెల్యే ప్రదీప్ పర్మార్, మహేమ్‌దావద్ ఎమ్మెల్యే అర్జున్‌సిన్హ్ చౌహాన్, సూరత్-మజుర ఎమ్మెల్యే హర్ష్ సంఘ్వి, నికోల్ ఎమ్మెల్యే జగదీశ్ పంచల్, మోర్బి ఎమ్మెల్యే బ్రిజేష్ మెర్జా, కపర్డా ఎమ్మెల్యే జితు చౌదరీ, వడోదర ఎమ్మెల్యే మనీషా వకీల్ ఉన్నారు. ఈ మధ్యాహ్నం 1.30 గంటలకు భూపేంద్ర పటేల్ సారథ్యంలోని కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసింది. మంత్రి పదవులు దక్కించుకున్న వారిలో నరేష్ పటేల్, జితు చౌదరి గిరిజన ఎమ్మెల్యేలు.    

Updated Date - 2021-09-16T21:17:21+05:30 IST