Advertisement
Advertisement
Abn logo
Advertisement

అసెంబ్లీలో సమస్యలపై ప్రశ్నించనివ్వడంలేదు

మహిళల ఆత్మ గౌరవ సభలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు


పాలకొల్లు అర్బన్‌, డిసెంబరు 1 : నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిద్దామంటే అవకాశం ఉండడంలేదని ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామా నా యుడు వాపోయారు. పట్టణ 20వ వార్డులో బుధవారం  నిర్వహించిన  18, 20, 21వ వార్డుల ఆత్మ గౌరవ సభలో ఆయన మాట్లాడారు. కౌరవ సభలో వ్యక్తిగత దూషణలకు తెరతీస్తూ ప్రజా సమస్యలపై ప్రశ్నించకుండా అధికార పక్షం వ్యవ హరిస్తోందని అన్నారు.విద్యుత్‌పై రెండున్నరేళ్లలో 6 మార్లు చార్జీలు పెంచి రూ.13 వేల కోట్లు పేదల నుంచి పిండుకున్నారని, చెత్త, మరుగుదొడ్లపై కూడా పన్ను విధించడం విచిత్రమన్నారు. తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కర్నేన రోజారమణి మాట్లాడుతూ నిత్యావసరాలు, గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనవసర వ్యాఖ్యలు తగవన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, గొట్టుముక్కల సూర్య నారాయణ, పసుపులేటి ప్రభుదాసు, మహ్మద్‌ జానీ, మేడిశెట్టి కేశవ, పీతల శ్రీను, అన్నా బత్తుల దుర్గా భాస్కరావు, పొట్నూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement