అచ్చెన్న ఆరోగ్యంగా ఉంటే.. వీల్ చైర్ అవసరం ఏముంది?: రామానాయుడు

ABN , First Publish Date - 2020-07-02T18:07:54+05:30 IST

ఏలూరు: రివర్స్ పాలన మహిమతో రాష్ట్రంలో నేరస్తులు రోడ్డుపై తిరుగుతున్నారని.. నిరపరాధులు జైల్లో ఉంటున్నారని..

అచ్చెన్న ఆరోగ్యంగా ఉంటే.. వీల్ చైర్ అవసరం ఏముంది?: రామానాయుడు

ఏలూరు: రివర్స్ పాలన మహిమతో రాష్ట్రంలో నేరస్తులు రోడ్డుపై తిరుగుతున్నారని.. నిరపరాధులు జైల్లో ఉంటున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. 108, 104 అంబులెన్స్‌లో 300 కోట్లు కొట్టేసిన వాళ్ళు ప్రారంభోత్సవాలు, పుట్టిన రోజులు జరుపుకుంటున్నారని విమర్శించారు. అచ్చెన్న ఆరోగ్యంగా ఉండుంటే, వీల్ చైర్‌లో తీసుకేళ్లే అవసరం అవసరం ఏముందని ప్రశ్నించారు.


ఇప్పటికే ప్రభుత్వ నిర్వాకంతో రెండు సార్లు ఆపరేషన్ చేశారన్నారు. అచ్చెన్నను ఒక్క రోజైనా జైల్లో ఉంచాలనేది జగన్ పైశాచిక ఆనందం కోసమేనన్నారు. బీసీలంటే జగన్‌కు చులకన, కక్షసాధింపు అన్నారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్ అందరిని జైలుకు పంపించాలని అవినీతి బురద అంటిస్తున్నారని రామానాయుడు విమర్శించారు.

Updated Date - 2020-07-02T18:07:54+05:30 IST