Abn logo
Sep 21 2021 @ 16:46PM

నేను చేసిన తప్పు ఏంటో చెప్పాలి: నిమ్మల

అమరావతి: అసెంబ్లీ దేవాలయం..తాను చేసిన తప్పు ఏంటో చెప్పాలని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. తాను సభలో మాట్లాడిన మాటల్లో తప్పు లేదన్నారు. సభను తప్పుదారి పాటించిన మాటలు ఏంటో ప్రివిలేజ్ కమిటీ సభ్యులు చెప్పాలన్నారు. సభ్యులు హక్కులు కాపాడే విదంగా ప్రివిలేజ్ కమిటీ నిర్ణయాలు ఉండాలని చెప్పారు. తాను పేద ప్రజలకు పెన్షన్ హామీ మేరకు ఎందుకు పెంచలేదని ప్రశ్నించానని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షంగా చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తన గొంతు నొక్కే విధంగా ప్రివిలేజ్ కమిటీ నిర్ణయాలు ఉన్నాయన్నారు. స్పీకర్ కూడా సముచుతింగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. సభలో తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే.. ప్రజా ఈ క్షేత్రంలో వాస్తవాలు చెబుతామన్నారు. 

క్రైమ్ మరిన్ని...