కేరళ రేవ్ పార్టీలో డ్రగ్ సీజ్..9 మంది అరెస్ట్

ABN , First Publish Date - 2020-12-22T16:09:39+05:30 IST

కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లా వాగమాన్ లోని ప్రైవేటు రిసార్టులో రేవ్ పార్టీ జరుగుతుండగా, పోలీసులు ఆకస్మిక దాడి చేసి, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకొని....

కేరళ రేవ్ పార్టీలో డ్రగ్ సీజ్..9 మంది అరెస్ట్

ఇడుక్కి (కేరళ): కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లా వాగమాన్ లోని ప్రైవేటు రిసార్టులో రేవ్ పార్టీ జరుగుతుండగా, పోలీసులు ఆకస్మిక దాడి చేసి, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకొని 9మందిని అరెస్టు చేశారు. రిసార్టులో రేవ్ పార్టీ జరుగుతుందని అందిన సమాచారం మేర  తాము దాడి చేశామని, ఈ రేవ్ పార్టీలో 59 మంది పాల్గొన్నారని ఇడుక్కి జిల్లా ఎస్పీ కరుప్పస్వామి చెప్పారు. కట్టపన డీఎస్పీ రాజ్ మోహన్ నేతృత్వంలో పోలీసులు దాడి చేసి ఎస్టసీ టాబ్లెట్లు, పౌడరు, ఎల్ఎస్డీ, చరాసా, హాషిష్, ఎల్ఎస్డీ స్టాంపు, మేత్ క్రిస్టల్, గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. ప్రైవేటు రిసార్టు  స్థానిక సీపీఐ నాయకుడు షాజీ కుట్టక్కడ్ దని పోలీసులు చెప్పారు. 

Updated Date - 2020-12-22T16:09:39+05:30 IST