Advertisement
Advertisement
Abn logo
Advertisement

యూఎస్‌లోకి ప్రవేశించేందుకు యత్నించి.. 9 ఏళ్ల బాలిక మృతి !

వాషింగ్టన్: ఇదొ విషాద ఘటన. తొమ్మిదేళ్ల మెక్సిన్ బాలిక అమెరికాలోకి ప్రవేశించేందుకు రియో గ్రాండే నదిని దాటే క్రమంలో మృతిచెందింది. శుక్రవారం ఈ విషయాన్ని బార్డర్ పెట్రోల్ సిబ్బంది వెల్లడించింది. మార్చి 20న ఈ ఘటన జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నది మధ్యలో ఓ మహిళ ఆమె మూడేళ్ల కుమారుడితో పాటు ఈ 9 ఏళ్ల మెక్సికన్ బాలిక అచేతనంగా పడి ఉండడం గుర్తించిన పెట్రోల్ సిబ్బంది బయటకు తీశారు. కొద్దిసేపటి తర్వాత మహిళ, మూడేళ్ల బాలుడు స్పృహాలోకి రాగా.. బాలిక అప్పటికే మరణించినట్లు సిబ్బంది పేర్కొంది. మార్చి 20న టెక్సాస్‌లో యూఎస్-మెక్సికో బార్డర్ క్రాస్ చేసే సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు గుర్తించారు.


ఇక గడిచిన కొన్ని రోజులుగా అమెరికా-మెక్సికో బార్డర్‌ను దాటి వస్తున్న వలసదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు సరిహద్దు పెట్రోలింగ్ సిబ్బంది వెల్లడించింది. ఈ క్రమంలో వారు ప్రమాదాల బారినపడుతున్నట్లు తెలిపారు. ఇలా సరిహద్దును దాటే క్రమంలో ప్రమాదాల బారినపడ్డ సుమారు 500 మందిని పెట్రోలింగ్ సిబ్బంది రక్షించినట్లు సమాచారం. గురువారం కూడా దాదాపు 6వేల మంది వలసదారులు అమెరికాలోకి ప్రవేశించేందుకు మెక్సికో బార్డర్‌కు వచ్చినట్లు అక్కడ విధులు నిర్వహిస్తున్న పెట్రోలింగ్ అధికారి ఒకరు చెప్పారు. ఇదిలాఉంటే.. ఈ వలసదారుల సమస్యలను పరిష్కరించే బాధ్యతను అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు అప్పగించిన విషయం తెలిసిందే.     

Advertisement
Advertisement