2 గంటల్లో 23 కిలోమీటర్ల పరుగు.. తొమ్మిదేళ్ల బాలిక రికార్డ్

ABN , First Publish Date - 2021-03-07T16:46:13+05:30 IST

తొమ్మిదేళ్ల బాలిక రెండు గంటల వ్యవధితో 23 కి.మీ పరుగు తీసి రికార్డు నెలకొల్పింది.

2 గంటల్లో 23 కిలోమీటర్ల పరుగు.. తొమ్మిదేళ్ల బాలిక రికార్డ్

చెన్నై/పెరంబూర్‌ : తంజావూరు జిల్లా పట్టుకోటలో తొమ్మిదేళ్ల బాలిక రెండు గంటల వ్యవధితో 23 కి.మీ పరుగు తీసి రికార్డు నెలకొల్పింది. ఆనైకాడు సిలంబకూట్టం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో భాగంగా సెన్నపట్టు తాంగాడు గ్రామానికి చెందిన మారిముత్తు, మాల దంపతుల కుమార్తె, ఎస్‌ఈడీ విద్యాదేవి మెట్రిక్‌ మహోన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న వర్షిత (9) పరుగు పందెం ఏర్పాటు చేశారు. పట్టుకోట బస్టాండ్‌ నుంచి శనివారం ఉదయం ప్రారంభమైన పరుగును పట్టుకోట సబ్‌ కలెక్టర్‌ బాలచంద్ర జెండా ఊపి ప్రారంభించారు. వర్షిత రెండు గంటల పాటు 23 కి.మీ దూరం పరుగుతీసి రికార్డు నెలకొల్పింది. బాలికను కార్పొరేషన్‌ కమిషనర్‌ చెన్నకృష్ణన్‌ అభినందించగా, నోబల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ఆర్గనైజర్‌ అర్జునన్‌ వర్షితకు సర్టిఫికెట్‌ అందజేశారు.

Updated Date - 2021-03-07T16:46:13+05:30 IST