Advertisement
Advertisement
Abn logo
Advertisement

కబడ్డీ నేర్పిస్తానంటూ తొమ్మిదేళ్ల బాలికలకు మాయమాటలు చెప్పి.. తోటల్లోకి తీసుకెళ్లి.. తండ్రీకొడుకులు చేసిన నిర్వాకమిది!

కడపాలెంలో అమానుషం

తొమ్మిదేళ్ల బాలికలపై లైంగికదాడి

తండ్రీకొడుకుల అఘాయిత్యం

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబీకులు

దిశ పోలీసు స్టేషన్‌ డీఎస్పీ విచారణ

పోక్సో చట్టం కింద కేసు నమోదు


అచ్యుతాపురం(విశాఖపట్నం): అచ్యుతాపురం మండలం కడపాలెంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. అభంశుభం తెలియని తొమ్మిదేళ్ల బాలికలకు మాయమాటలు చెప్పి... అదే గ్రామానికి చెందిన తండ్రీకొడుకు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తిను బండారాలు, డబ్బులు ఆశ చూపించి, సమీపంలోని సరుగుడు తోటల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేశారు. బాలికలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనకాపల్లి దిశ పోలీసు స్టేషన్‌ డీఎస్పీ ఎం.మహేశ్వరరావు మంగళవారం గ్రామానికి వచ్చి విచారణ చేప ట్టారు. దీనికి సంబంధించి ఆయన చెప్పిన వివరాలిలా వున్నాయి.


పూడిమడక పంచాయతీ శివారు కడపాలెం గ్రామానికి చెందిన మేరుగు బాపయ్య, నూకరాజు తండ్రీకుమారులు. ఇదే గ్రామానికి చెందిన నాలుగో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలకు (9 ఏళ్లు) కబడ్డీ నేర్పిస్తానంటూ నూకరాజు ఊరికి దూరంగా వున్న సరుగుడు తోటలోకి తీసుకెళ్లి, అక్కడ వారిపై లైంగిక దాడిచేసేవాడు. ఈ క్రమంలో బాపయ్య కూడా తిను బండారాలు, డబ్బులు ఇచ్చి, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. దీంతో తీవ్రభయాందోళన చెందిన బాలికలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. వారు సోమవారం అచ్యుతాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనకాపల్లి దిశ పోలీసు స్టేషన్‌ డీఎస్పీ మహేశ్వరరావు మంగళవారం కడపాలెం వచ్చి విచారణ చేపట్టారు. నిందితులు బాపయ్య, నూకరాజు పరారీలో వున్నారని, వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని,. బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించామని ఆయన చెప్పారు. డీఎస్పీ వెంట ఎలమంచిలి సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ ఉపేంద్ర వున్నారు. 

Advertisement
Advertisement