స్వామివారి కల్యాణం నిరాడంబరంగా నిర్వహించాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-04-21T05:13:46+05:30 IST

జిల్లాలో కరోనా మహామ్మారి విజృంభిస్తున్న నేపధ్యంలో బుధవారం భద్రాచలంలో నిర్వహించే శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని నిరాడంబరంగా, కోవెల లోపలే అతి కొద్ది మంది సమక్షంలో నిర్వహించాలని కలెక్టర్‌ ఎంవీ రెడ్డి కోరారు.

స్వామివారి కల్యాణం నిరాడంబరంగా నిర్వహించాలి: కలెక్టర్‌

కొత్తగూడెం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 20: జిల్లాలో కరోనా మహామ్మారి విజృంభిస్తున్న నేపధ్యంలో బుధవారం భద్రాచలంలో నిర్వహించే శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని నిరాడంబరంగా, కోవెల లోపలే అతి కొద్ది మంది సమక్షంలో నిర్వహించాలని కలెక్టర్‌ ఎంవీ రెడ్డి కోరారు. మంగళవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో ఆలయ పండితులచే నిర్వహించబడే శ్రీ స్వామి వారి కళ్యాణానికి రాష్ట్ర  ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రా లను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మాత్యులు పువ్వాడ అజయ్‌ కుమార్‌లు సమర్పించనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలంతా సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో ఉండాలని రాముడు  నడియా డిన ఈ నేలలో ప్రజలు వ్యాధులు, భాదలు నుంచే రక్షింపబడాలని, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో జిల్లా, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కలెక్టర్‌ అభిష్టించారు. జిల్లా వాసులకు ముందస్తు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. 


Updated Date - 2021-04-21T05:13:46+05:30 IST