బాబోయ్.. 60 సెకన్లలో 100పైగా పుషప్స్.. వైరల్ అవుతున్న 24ఏళ్ల యువకుడి వీడియో..

ABN , First Publish Date - 2022-01-23T22:42:28+05:30 IST

అతడి వయసు 24ఏళ్లు. కానీ ఆ యువకుడు ప్రపంచ రికార్డు సృష్టించాడు. కళ్లు చెదిరే రీతిలో పుషప్స్ తీసి

బాబోయ్.. 60 సెకన్లలో 100పైగా పుషప్స్.. వైరల్ అవుతున్న 24ఏళ్ల యువకుడి వీడియో..

ఇంటర్నెట్ డెస్క్: అతడి వయసు 24ఏళ్లు. కానీ ఆ యువకుడు ప్రపంచ రికార్డు సృష్టించాడు. కళ్లు చెదిరే రీతిలో పుషప్స్ తీసి అందరినీ ఆశ్చర్యపర్చాడు. ప్రస్తుతం ఆ కుర్రాడికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


వ్యాయామంలో భాగంగా సాధారణంగా చాలా మంది పుషప్స్ తీస్తారన్న విషయం తెలిసిందే. ఫిజికల్‌గా ఎంత ఫిట్‌గా ఉన్నా ఏకదాటిగా 20-30 పుషప్స్ తీయొచ్చు. ఇంకొంచెం ప్రయత్నిస్తే ఈ సంఖ్య 35 వరకూ చేరొచ్చు. కానీ మణిపూర్‌కు చెందిన 24ఏళ్ల తౌనోజం నిరంజోయ్ సింగ్ మాత్రం.. చేతి వేళ్లపై బ్యాలెన్స్ చేస్తూ క్షణం కూడా ఆగకుండా ఒకేఒక్క నిమిషంలో ఏకంగా 100కుపైగా పుషప్స్‌ తీసి అందరినీ ‘ఔరా!’ అనిపించాడు. దీంతో కేవలం 60 సెకన్లలో అత్యధిక పుషప్స్ తీసిన వ్యక్తిగా ఈ కుర్రాడిపేరు గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు స్పందిస్తూ.. నిరంజోయ్ సింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.






Updated Date - 2022-01-23T22:42:28+05:30 IST