అటవీ శాఖ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు

ABN , First Publish Date - 2021-06-23T05:14:56+05:30 IST

రెవెన్యూ పట్టా పాసు పుస్తకాలున్నా తమ భూముల్లో సాగు చేయనీ యకుండా అటవీ అధికారులు దౌర్జన్యంగా వ్యవహ రిస్తున్నారని మంగళవారం పెంచికలపేట మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయాన్ని లోడ్పల్లి, ఎల్కపల్లి గ్రామాల రైతులు ముట్టడిం చారు.

అటవీ శాఖ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు
పెంచికలపేట అటవీ శాఖ కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తున్న రైతులు

-పట్టాలున్నా అధికారులు సాగు పనులను అడ్డుకుంటున్నారని ఆరోపణ
పెంచికలపేట, జూన్‌22: రెవెన్యూ పట్టా పాసు పుస్తకాలున్నా తమ భూముల్లో సాగు చేయనీ యకుండా అటవీ అధికారులు దౌర్జన్యంగా వ్యవహ రిస్తున్నారని  మంగళవారం పెంచికలపేట మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయాన్ని లోడ్పల్లి, ఎల్కపల్లి గ్రామాల రైతులు ముట్టడిం చారు. లోడ్పల్లి గ్రామానికి చెందిన జర్పుల కిషన్‌ అనే రైతు చేనులో వ్యవసాయ పనిముట్లను ఎడ్లబండి, నాగలిని అటవీ శాఖబీట్‌ అధికారి గొడ్డలితో నరికి ధ్వంసం చేశాడని రైతులు ఆరోపించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 40 ఏళ్లుగా భూములను సాగు చేసు కుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. పట్టాపాసు పుస్తకాలు ఉన్నా అటవీ శాఖాధికారులు ఇబ్బం దులకు గురి చేస్తూ దౌర్జన్యం చేస్తున్నా రన్నారు. జాయింట్‌ సర్వే పేరుతో కాలయాపన చేస్తూ వ్యవసాయ సాగుకు అటవీ అధికారులు అడ్డు పడుతున్నారని రైతులు ఆరోపిం చారు. వర్షాకాల సాగుకు అనుమతి ఇచ్చి జాయింట్‌ సర్వే నిర్వహించి న్యాయం చేయాలన్నారు. ఎఫ్‌ఆర్వో వేణుగోపాల్‌, తహసీల్దార్‌ అనంతరాజ్‌, ఎస్సై రమేష్‌లు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడినా జాయింట్‌ సర్వేపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు శాంతియుతంగా నిరసన కొనసాగి స్తామని స్పష్టం చేశారు. ఈ విషయమై ఎఫ్‌ఆర్వో వేణుగోపాల్‌ను సంప్రదించగా రెవెన్యూ అధికా రులతో త్వరలో జాయింట్‌ సర్వే నిర్వహిస్తామని తెలిపారు. అటవీ శాఖ భూమి అయినందున సాగును ఆపే ప్రయత్నం చేశామని ఎఫ్‌ఆర్వో పేర్కొన్నారు.

Updated Date - 2021-06-23T05:14:56+05:30 IST