Nirav Modi అపీలు... భారత్‌కు అప్పగింతపై సవాలు...

ABN , First Publish Date - 2021-05-01T18:11:13+05:30 IST

భారత్ నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బ్రిటన్ హైకోర్టును

Nirav Modi అపీలు... భారత్‌కు అప్పగింతపై సవాలు...

లండన్ : భారత్ నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బ్రిటన్ హైకోర్టును ఆశ్రయించారు. తనను భారత దేశానికి అప్పగించాలని క్రింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను బ్రిటన్ హోం సెక్రటరీ ఆమోదించడాన్ని సవాలు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఆయనను భారత దేశానికి అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఏప్రిల్ 15న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 


బ్రిటన్ హోం శాఖ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, నీరవ్ మోదీని భారత దేశానికి అప్పగించాలని డిస్ట్రిక్ట్ జడ్జి ఫిబ్రవరి 25న తీర్పు చెప్పినట్లు తెలిపారు. భారత దేశానికి అప్పగించేందుకు ఏప్రిల్ 15న ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. 


నీరవ్ మోదీ సుమారు రూ.11,000 కోట్ల మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించినట్లు ఆరోపణలు నమోదైన సంగతి తెలిసిందే. ఆయనపై సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. ఆయన మోసాలు, మనీలాండరింగ్ వంటి నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఆయనను 2019 మార్చిలో లండన్‌లో అరెస్టు చేశారు. 


Updated Date - 2021-05-01T18:11:13+05:30 IST