నీరవ్‌ ఆస్తుల స్వాధీనం

ABN , First Publish Date - 2020-07-09T06:17:17+05:30 IST

వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి చెందిన రూ.329.66 కోట్ల విలువ గల ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రకటించింది. దేశంలో బ్యాంకులకు టోపీ పెట్టడమే కాకుండా చట్టం నుంచి తప్పించుకునేందుకు...

నీరవ్‌ ఆస్తుల స్వాధీనం

న్యూఢిల్లీ: వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి చెందిన రూ.329.66 కోట్ల విలువ గల ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రకటించింది. దేశంలో బ్యాంకులకు టోపీ పెట్టడమే కాకుండా చట్టం నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పరారీ అయ్యే ధోరణులకు అడ్డుకట్ట వేసేందుకు మోదీ ప్రభుత్వం 2018లో తీసుకువచ్చిన చట్టం పరిధిలో జరిగిన తొలి స్వాధీనం ఇదేనని ఈడీ తెలిపింది. ముంబైకి చెందిన వోర్లిలోని భవనం, అలీబాగ్‌లోని భూమి, జైసల్మీర్‌లోని విండ్‌ మిల్లు, లండన్‌, యుఏఇలోని ఫ్లాట్లు వీటిలో ఉన్నాయి.


Updated Date - 2020-07-09T06:17:17+05:30 IST