బీఎస్పీలో చేరిన నిర్భయ లాయర్ సీమా

ABN , First Publish Date - 2022-01-20T22:04:41+05:30 IST

2012 నాటి నిర్భయ కేసుతో పాటు గతేడాది హత్రాస్ కేసులో బాధితుల తరపున సుప్రీంలో వాదనలు వినిపించిన లాయర్ సీమా కుశ్వాహా గురువారం బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. ఆమెతో పాటు మరో లాయర్ సామ్రాట్ సుజిత్ కూడా బీఎస్పీలో చేరారు. ఉత్తరప్రదేశ్ బీఎస్పీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా సమక్షంలో వీరిద్దరూ అధికారంగా బీఎస్పీ సభ్యత్వం తీసుకున్నారు.

బీఎస్పీలో చేరిన నిర్భయ లాయర్ సీమా

లఖ్‌నవూ: 2012 నాటి నిర్భయ కేసుతో పాటు గతేడాది హత్రాస్ కేసులో బాధితుల తరపున సుప్రీంలో వాదనలు వినిపించిన లాయర్ సీమా కుశ్వాహా గురువారం బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. ఆమెతో పాటు మరో లాయర్ సామ్రాట్ సుజిత్ కూడా బీఎస్పీలో చేరారు. ఉత్తరప్రదేశ్ బీఎస్పీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా సమక్షంలో వీరిద్దరూ అధికారంగా బీఎస్పీ సభ్యత్వం తీసుకున్నారు.


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీమా కుశ్వాహా చేరిక బీజేపీకి మరింత బలాన్ని ఇస్తుందని అంటున్నారు. మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ పనితీరుపై ప్రశంసలు కురిపిస్తుంటారు ఆ పార్టీ మద్దతుదారులు. ఆ ప్రస్తావన తీస్తూనే ఉత్తరప్రదేశ్‌లో మహిళలు సురక్షితంగా ఉండాలంటే బీఎస్పీ అధికారంలోకి రావాలని ప్రస్తుతం ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశాన్ని కుదిపేసిన నిర్భయ, హత్రాస్ లాంటి కేసుల్లో బాధితుల తరపున కోర్టు ముందు వాదనలు వినిపించిన సీమా పార్టీలోకి చేరడం వల్ల మహిళల్లో మరింత ఆదరణ లభిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.


ఇకపోతే.. సీమా కుశ్వాహా, ఉత్తరప్రదేశ్‌లోని ఈటీవా జిల్లా బిదిపూర్ గ్రామంలో 1982 జనవరి 10న జన్మించారు. ఆమె తల్లిదండ్రులు రాంకున్రి కుశ్వాహా, బలదిన్ కుశ్వాహా. వీరికి ఆరుగురు ఆడపిల్లలు. అందులో సీమా నాలుగవ కూతురు. అయితే 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం వల్ల ఈమె బయటికి ప్రపంచానికి బాగా పరిచయం అయ్యారు. ఆ కేసులో ఆమె బాధిత కుటుంబం తరపున కోర్టులో వాదనలు వినిపించారు. ఇవే కాకుండా సమాజంలో అణచివేతకు గురవుతున్న వారిపట్ల ఆమె ఎంతో కాలంగా న్యాయ పోరాటం చేస్తున్నారు. ‘‘ఒకరి లక్ష్యాలను సాధించడానికి, మరొకరు కష్టపడి పనిచేయాలి, పోరాడాలి’’ అని సీమా కుశ్వాహా ప్రతి సందర్భంలో చెప్తుంటారు.

Updated Date - 2022-01-20T22:04:41+05:30 IST