నిర్మల్: ప్రజలందరి జీవితాల్లో సంక్రాంతి పండుగ వెలుగు నింపి అందరి ఇళ్ళల్లో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆకాంక్షించారు. నిర్మల్ జిల్లా ప్రజలకు మంత్రి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇంట్లోకి వచ్చిన గంగిరెద్దు బసవన్న చేసిన విన్యాసాలను మంత్రి తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి గోమాతను శాలువాతో సత్కరించి కానుకలు అందజేశారు.