Abn logo
Aug 31 2021 @ 11:46AM

నిర్మల్ జిల్లాను వెంటాడుతున్న వరద

నిర్మల్: తెలంగాణలో పలు చోట్ల వానలు దంచికొడుతున్నాయి. నిర్మల్ జిల్లాను మరోసారి వరద ముప్పు వెంటాడుతోంది. తాజా వర్షాలతో బైంసా డివిజన్‌లో జనజీవనం స్తంభించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కుబీర్‌లోని మేదరవాడలోకి వరద పోటెత్తింది. రాత్రంతా వరదలోని బాధిత కుటుంబాలు బిక్కు బిక్కు మంటూ గడిపాయి. పోలీసుల సహకారంతో స్థానికులు వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. గ్రామ పంచాయతీలో వసతి ఏర్పాటు చేశారు. వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.