బాసరలో నారా దేవాన్షుకు అక్షరాభ్యాసం

ABN , First Publish Date - 2021-03-05T16:28:32+05:30 IST

నారా లోకేష్, బ్రాహ్మణిల కుమారుడు దేవాన్షుకు బాసరలో అక్షరాభ్యాసం చేశారు.

బాసరలో నారా దేవాన్షుకు అక్షరాభ్యాసం

నిర్మల్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మనుమడు, నారా లోకేష్, బ్రాహ్మణిల కుమారుడు దేవాన్షుకు శుక్రవారం బాసరలో అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేశారు. బ్రాహ్మణి తల్లి వసుంధర, ఇతర బంధువులతో కలిసి అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. దగ్గరుండి పూజా కార్యక్రమాలు చేయించారు. అలాగే బాలకృష్ణ రెండో అల్లుడు భరత్, అతని భార్య తేజస్విని, వారి కుమారుడు ఆర్యన్‌కు అక్షరాభ్యాసం చేయించారు. 

Updated Date - 2021-03-05T16:28:32+05:30 IST