Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిర్మల్ జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు.. అప్పు ఇచ్చి భూమిపై కన్ను..

నిర్మల్: జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు శృతిమించుతున్నాయి. అధిక వడ్డీలతో సామాన్యులను పీడిస్తున్నారు. అప్పు వసూలు కోసం అరాచకాలకు పాల్పడుతున్నారు. ఓ వ్యాపారి అయితే అప్పు ఇచ్చి ఏకంగా భూమినే ఆక్రమించుకున్నాడు. బైంసాకు చెందిన ఓ నగల వ్యాపారి దగ్గర రాజు అనే వ్యక్తి ఐదేళ్ల క్రితం రూ. 3 లక్షల 50వేలు అప్పు తీసుకున్నాడు. ఆ సమయంలో రెండెకరాల భూమిని తనఖా పెట్టుకున్నాడు. గడవు దాటిందంటూ తనఖా పెట్టిన భూమిని వ్యాపారి తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అసలు విషయం తెలిసి వ్యాపారిని నిలదీశారు. వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పినా.. భూమి తిరిగిచ్చేది లేదని, భూమి కావాలంటే రూ. 18 లక్షలు కట్టాలంటూ నగల వ్యాపారి హుకూం జారీ చేశాడు. దీంతో బాధితులు కుటుంబంతో సహా వ్యాపారి దుకాణం వద్ద బైటాయించారు. ఆ తర్వాత స్థానికులు జోక్యం చేసుకుని వ్యాపారికి సర్ది చెప్పడంతో బాధితుడికి భూమి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు.

Advertisement
Advertisement