కడెం ప్రాజెక్టులోకి పోటెత్తిన వరద

ABN , First Publish Date - 2021-07-11T13:21:44+05:30 IST

ఎగువన కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. దీంతో అధికారులు ఐదు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు.

కడెం ప్రాజెక్టులోకి పోటెత్తిన వరద

నిర్మల్: ఎగువన కురుస్తున్న వర్షాలతో  కడెం ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. దీంతో అధికారులు ఐదు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 34 వేల క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 29 వేల క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 696,775 అడుగులకు చేరింది. కడెం ప్రాజెక్ట్‌‌కు వదర ఉధృతి అధికంగా ఉండటంతో గోదావరి దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు. 

Updated Date - 2021-07-11T13:21:44+05:30 IST