కడెం ప్రాజెక్ట్‌లోకి పోటెత్తిన వరద
ABN , First Publish Date - 2021-07-14T18:21:17+05:30 IST
కడెం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఆరు గేట్లను ఎత్తివేసి 32262
నిర్మల్: కడెం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఆరు గేట్లను ఎత్తివేసి 32262 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 28215 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులకు గాను... ప్రస్తుత నీటిమట్టం 696.75 అడుగులకు చేరింది. గేట్లు ఎత్తివేయడంతో గోదావరి దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.