Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిర్మాణాలు ఎలా చేపట్టాలి?

జాయింట్‌ కలెక్టర్‌ హౌసింగ్‌ శ్రీవాసనుపుర్‌ అజయ్‌కుమార్‌ను ప్రశ్నించిన జగనన్న కాలనీ లబ్ధిదారులు

బోళ్లపాడు(ఉయ్యూరు), డిసెంబరు 7 :  కనీస వసతులు కల్పించకుండా నిర్మాణాలు చేపట్టమంటే ఎలా చేపట్టగలమని జగనన్న కాలనీ లబ్ధిదారులు జేసీని ప్రశ్నించారు. మండల పరిధిలోని జగన న్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలనకు మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ హౌసింగ్‌ శ్రీవాసనుపుర్‌ అజయ్‌ కుమార్‌ బోళ్లపాడు, ముదునూరు, శాయిపురం, కాటూరు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా బోళ్లపాడు, శాయిపురం, ముదునూరు, కడవకొల్లు, ఆకునూరు గ్రామాల్లో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం  చేపట్టక పోవడం గమనించి లబ్ధిదారులను, స్థానిక ప్రజాప్రతినిధు లను ప్రశ్నించారు. మోకాలు లోతు నీరు, రోడ్డు, ఇతర సౌకర్యాలు లేని స్థలాల్లో ఇళ్లు  ఎలా నిర్మించుకుంటారని ఎదురు ప్రశ్నించారు. కొన్ని గ్రామాల్లోని కాలనీల్లో ఫిల్లింగ్‌ చేసిన వారికి ఇంత వరకు బిల్లులు రాలేదని, దీంతో మెరక తోలేందుకు ఎవరు ముందుకు రావడం లేదని బోళ్లపాడు ఎంపీటీసీ గంగారత్నం తెలిపారు. ఫిల్లింగ్‌ చేస్తే బిల్లులు అయ్యేలా చూస్తానని జేసీ అన్నారు. నీరు తోడించి, ఫిల్లింగ్‌ చేయించాలన్న సూచనకు  ప్రజా ప్రతినిధులు  అంగీకరిం చలేదు.  స్థానికులకు నచ్చచెప్పి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని మండల అధికారులను జేసీ ఆదేశించారు.  తహసీల్దార్‌ నాగేశ్వరరావు, ఎంపీడీవో సునీతాశర్మ, హౌసింగ్‌ డీఈ భాస్కర్‌రావు, ఏఈ బుల్లయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement