రైతు వేదికలకు మోక్షం

ABN , First Publish Date - 2020-05-26T05:34:07+05:30 IST

రెండేళ్లుగా నామ మాత్రంగా మారిన రైతు వేదికల నిర్మాణానికి మోక్షం ల భించింది.

రైతు వేదికలకు మోక్షం

సిరిసిల్ల జిల్లాలో 57 క్లస్టర్లలో స్థలం గుర్తింపు 

రూ.11.40 కోట్లతో భవన నిర్మాణాలు 

నేడు మూడు చోట్ల భూమి పూజ 

మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి రాక

వేములవాడలో నియంత్రిత సాగు విధానంపై అవగాహన సదస్సు


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

రెండేళ్లుగా నామ మాత్రంగా మారిన రైతు వేదికల నిర్మాణానికి మోక్షం ల భించింది. రైతులకు గిట్టుబాటు ధర, నాణ్యమైన విత్తనాలు, పంటల మార్పు వంటివి లక్ష్యంగా ప్రభుత్వం రైతు బంధు స మితులను ఏర్పాటు చేసింది. నిరంతర సమా వేశాలతో మార్పు తెచ్చే దిశగా రైతు వేదిక భవనాలను నిర్మించడానికి ప్రభుత్వం గతంలోనే ప్రతిపాదనలు స్వీకరించింది.కార్యరూపం దాల్చ లేదు. విధులు, విధానాలు లేక కొంతకాలంగా రైతు బంధు సమితుల సేవలు మొదలు కాలేదు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నియంత్రిత సాగువిధానంలో రైతు బంధు సమితుల సభ్యులు కీల కంగా మారనున్నారు. రైతులకు అందుబాటులో ఉండి నియంత్రిత వ్యవసాయ విధానాన్ని అమల్లోకి తేవడంలో ముఖ్య భూమిక పోషించ నున్నారు.


రాజన్న సిరిసిల్ల జిల్లాలో 57 క్లస్టర్లలో రూ.20 లక్షలతో క్లస్టర్‌కు ఒక భవనం చొప్పున నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన స్థలం సేకరణ ప్రక్రియను రెండేళ్ల క్రితమే ప్రారంభించారు. ప్రస్తుతం 57 క్లస్టర్లకూ స్థలాన్ని సేకరించారు. రైతు వేదికల భవన నిర్మాణాలకు ప్రభుత్వం రూ.11.40 కోట్లు కేటాయించనుంది. ఇందులో 7లక్షల విలు వల గల పనులు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా చేపట్టనుంది. 500 గజాల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించనున్నారు. భవనంలో ఎరువులు, విత్తనాలు నిల్వ ఉంచుకోవడానికి గదులు, రైతు సమావేశ మందిరం, అసిస్టెంట్‌ అగ్రికల్చర్‌ అధికారి కూర్చోవడానికి గది, రైతు బంధు సమితికి ఓ గదిని ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని 171 రెవెన్యూ గ్రామాల్లో 80 వేల మందికి పైగా రైతులు ఉన్నారు. రైతు బంధు సమితుల్లో 2,565 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. జిల్లా సమితిలో 24 మంది, మండల కమిటీల్లో 318 మందికి అవకాశం కల్పించారు. ఐదుగురు మహిళలకు ఇందులో అవకాశం ఇచ్చారు. 


నేడు రైతు వేదిక భవనాలకు భూమిపూజ

నియంత్రిత సాగు విధానంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో రైతు వేదిక భవనాల నిర్మాణం ముందుకు వచ్చింది. పురపాలక ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరం జన్‌రెడ్డి  మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌, బోయి నపల్లి మండల కేంద్రాలతోపాటు ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌ లో రైతు వేదిక భవనాలకు భూమి పూజ చేయనున్నారు. ఎల్లారెడ్డి పేట మండలం గొల్లపల్లి వ్యవసాయ గోడౌన్‌కు శంకుస్థాపన, మార్కె ట్‌ కమిటీ కార్యాలయ భవనం ప్రారంభోత్సవం, వేములవాడలో మధ్యా హ్నం 2 గంటలకు రైతు బంధు సమితి ఆధ్వర్యంలో నియంత్రిత  సా గుపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. నియంత్రిత సాగు విధానంపై నిర్వహించే అవగాహన సదస్సుకు మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డితోపాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ, ఎమ్మెల్యేలు రవిశంకర్‌, రసమయి బాలకిషన్‌ హాజరు కానున్నట్లు రైతు బంధు సమితి జిల్లా కో ఆర్టినేటర్‌ గడ్డం నర్సయ్య తెలిపారు. 

Updated Date - 2020-05-26T05:34:07+05:30 IST