‘నిసర్గ’ తుపానుతో ముంబై వాయు కాలుష్యం తగ్గింది!

ABN , First Publish Date - 2020-06-04T23:43:39+05:30 IST

‘నిసర్గ’ తుపాను ముంబై వాయు కాలుష్యాన్ని తగ్గించింది. ఈ ఏడాది

‘నిసర్గ’ తుపానుతో ముంబై వాయు కాలుష్యం తగ్గింది!

ముంబై : ‘నిసర్గ’ తుపాను ముంబై వాయు కాలుష్యాన్ని తగ్గించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు అత్యంత మెరుగైన రీడింగ్‌ గురువారం నమోదైంది. వాయు కాలుష్యం 17కు తగ్గిపోవడంతో ప్రజలు సంతోషిస్తున్నారు. 


మహారాష్ట్రలోని అలీబాగ్ వద్ద బుధవారం తీరం దాటిన ‘నిసర్గ’ తుపాను వల్ల కొంత వరకు మేలు జరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముంబైలో గురువారం కూడా వర్షాలు కురిశాయి. 


సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (సఫర్) అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం, గురువారం నమోదైన వాయు నాణ్యతను బట్టి  ప్రజల ఆరోగ్యానికి హాని లేని స్థాయిలో కాలుష్యం తగ్గింది. 


పర్టిక్యులేట్ మేటర్ 2.5 ఊపిరితిత్తులు, రక్తంలోకి చేరగలదు. వర్షాలు పడిన తర్వాత గురువారం మధ్యాహ్నం నమోదైన వివరాల ప్రకారం పర్టిక్యులేట్ మేటర్ 2.5 హానిలేని స్థాయికి అంటే, 15కు తగ్గింది. 


Updated Date - 2020-06-04T23:43:39+05:30 IST