నిస్సాన్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ మాగ్నైట్‌

ABN , First Publish Date - 2020-12-03T06:12:01+05:30 IST

నిస్సాన్‌ మోటార్స్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విభాగంలో ప్రవేశించింది. కొత్తగా మాగ్నైట్‌ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది.

నిస్సాన్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ మాగ్నైట్‌

ప్రారంభ ధర రూ.4.99 లక్షలు


న్యూఢిల్లీ: నిస్సాన్‌ మోటార్స్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విభాగంలో ప్రవేశించింది. కొత్తగా మాగ్నైట్‌ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. ఢిల్లీలో దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.4.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్లు రెండింటిలోనూ ఇది అందుబాటులో ఉంటుంది. ఈ విభాగంలో పోటీ అత్యధికంగా ఉన్నదని, పోటీలో ఉన్న కార్లన్నింటి కన్నా దీని ధర తక్కువగా నిర్ణయించామని కంపెనీ ప్రకటించింది. ఒక లీటర్‌ టర్బో పెట్రోల్‌ ట్రిమ్స్‌ వేరియెంట్ల ధర రూ.4.99 లక్షల నుంచి రూ.6.99 లక్షల మధ్యన, టర్బో పెట్రోల్‌ సీవీటీ వేరియెంట్ల ధర రూ.7.89 లక్షల నుంచి రూ.9.35 లక్షల మధ్యన నిర్ణయించారు. ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీలోగా జరిగే బుకింగ్‌లకు మాత్రమే ఈ ధర లు వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. ఈ కారులో 20 వరకు కొత్త, ఉత్తమ ఫీచర్లు ప్రవేశపెట్టామని, ఈ తరహా కార్లలో ఇలాంటి ఫీచర్లుండడం ఇదే ప్రథమమని నిస్సాన్‌ మోటా ర్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాకేష్‌ శ్రీవాస్తవ అన్నారు. 


ఏయే కార్లకు పోటీ? : మారుతి విటారా బ్రెజ్జా, హుండై వెన్యూ, టాటా నెక్సన్‌, కియా సోనెట్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ 300, హోండా డబ్ల్యూఆర్‌-వీ


ప్రత్యేక ఫీచర్లు...

 యాంటిలాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీసీ)

 ఎలక్ర్టానిక్‌ బ్రేక్‌ ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ (ఈబీడీ)

 హైడ్రాలిక్‌ బ్రేక్‌ అసిస్టెంట్‌ (హెచ్‌బీఏ)

 ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ (టీసీఎస్‌)

 హిల్‌ స్టార్ట్‌ అసిస్టెంట్‌ (హెచ్‌ఎ్‌సఏ)

 రెండు ఎయిర్‌బ్యాగ్‌లు

 360 డిగ్రీ అరౌండ్‌ వ్యూ మానిటర్‌

 కనెక్టివిటీ, వైర్‌లె్‌సచార్జర్‌, ఎయిర్‌ ప్యూరిఫయర్‌

 ఆహ్లాదకరమైన లైటింగ్‌, పడిల్‌ లాంప్‌లు

 60-40 స్ప్లిట్‌ ఫోల్డబుల్‌ వెనుక సీట్లు

Updated Date - 2020-12-03T06:12:01+05:30 IST