Jun 14 2021 @ 12:35PM

ఫైన‌ల్ షెడ్యూల్‌లో నితిన్ ‘మ్యాస్ట్రో’

హీరో నితిన్ తాజా చిత్రం ‘మ్యాస్ట్రో’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రైమ్‌ కామెడీ చిత్రంలో  నితిన్‌ సరసన నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ‘మ్యాస్ట్రో’ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. కొవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ ఫైన‌ల్ షెడ్యూల్ ఈరోజు హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. నితిన్, తమన్నాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ. ఈ షెడ్యూల్‌ చిత్రీకరణతో ‘మ్యాస్ట్రో’ సినిమా షూటింగ్‌ పూర్తవుతుంది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత షూటింగ్‌లో పాల్గొంటున్న హీరో నితిన్, అలాగే కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత చిత్రీకరణను మొదలుపెట్టిన బిగ్ మూవీ కూడా ‘మ్యాస్ట్రో’నే కావడం విశేషం. శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ‘మ్యాస్ట్రో’ సినిమాకు జె యువరాజ్‌ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.