Jul 20 2021 @ 12:22PM

mastro: నితిన్ ‘మాస్ట్రో’ రిలీజ్ ఖరారైందా?

నితిన్ క‌థానాయ‌కుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మాస్ట్రో’. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. కొవిడ్ సెకండ్ వేవ్ ప్ర‌భావంతో ఈ చిత్రాన్ని ఓటీటీలోనే విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు నిర్ణ‌యించుకున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌లో ఆగ‌స్ట్ 15న ‘మాస్ట్రో’ విడుదలవుతుంది.  బాలీవుడ్ మూవీ ‘అంధాదున్‌’ రీమేక్‌గా క్రైమ్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రంలో  నితిన్‌ సరసన నభా నటేష్‌ హీరోయిన్‌గా నటించ‌గా, హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషించింది.  కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత షూటింగ్‌లో స్టార్ చేసిన మూవీ ‘మాస్ట్రో’ కావడం విశేషం.  శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నఈ సినిమాకు జె యువరాజ్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.