Jun 3 2021 @ 14:29PM

ఆగస్టులో నితిన్ కొత్త చిత్రం..!

యూత్‌స్టార్ నితిన్ ఆగస్టు నుంచి కొత్త చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్టు తాజా సమాచారం. 'భీష్మ' సక్సెస్‌తో మంచి ఫాంలోకి వచ్చిన ఆయన వరుసగా ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'చెక్', 'రంగ్ దే' సినిమాలతో వచ్చాడు. కానీ నితిన్‌కి ఈ రెండు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అయినా తన దూకుడు మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్ 'అంధాదున్' తెలుగు రీమేక్ 'మాస్ట్రో'లో నటిస్తున్నాడు. మెజారిటీ పార్ట్ షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఇందులో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్నా కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇక 'పవర్ పేట' ప్రాజెక్ట్ చేతిలో ఉండగానే దర్శక, రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతుండగా ఆగస్టు నుంచి సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయట.