May 17 2021 @ 11:31AM

క‌రోనాతో కోలీవుడ్ యాక్ట‌ర్ నితీశ్ వీరా క‌న్నుమూత‌

కొవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్‌లో ప్ర‌జ‌ల ప్రాణాల‌ను హ‌రించేస్తుంది. సినీ రంగానికి సంబంధించి చూస్తే కొంద‌రు సెల‌బ్రిటీలు ఇప్ప‌టికే ప‌లువురు క‌రోనా కార‌ణంగా కన్నుమూశారు. మ‌రికొంద‌రు సెల‌బ్రిటీలు వారి కుటుంబ స‌భ్యుల్ని, స‌న్నిహితుల‌ను కోల్పోయారు.సోమవారం క‌రోనా కార‌ణంగా, కోలీవుడ్ చిత్ర సీమ‌కు చెందిన అప్ క‌మింగ్ యాక్ట‌ర్ నితీశ్ వీరా(45) కన్నుమూశారు. పేర‌రుసు, వెన్నిల క‌బ‌డి కుళు, పుదు పేట్టై, అసుర‌న్ చిత్రాల్లో చాలా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. నితీశ్ వీరా మృతిపై సినీ ప‌రిశ్ర‌మ సంతాపాన్ని వ్య‌క్తం చేస్తోంది.