నిత్య సృజనశీలి అంబటి వెంకన్న : సుంకిరెడ్డి

ABN , First Publish Date - 2021-04-19T06:03:24+05:30 IST

నిత్య సృజనశీలి అంబటి వెంకన్న అని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నా రు.

నిత్య సృజనశీలి అంబటి వెంకన్న : సుంకిరెడ్డి
పుస్తకాలను ఆవిష్కరిస్తున్న సుంకిరెడ్డి నారాయణరెడ్డి

నల్లగొండ కల్చరల్‌, ఏప్రిల్‌ 18 : నిత్య సృజనశీలి అంబటి వెంకన్న అని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నా రు. స్థానిక యూటీఎఫ్‌ భవన్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో అంబటి వెంకన్న రాసిన ‘అలుగెల్లిన పాట, నాన్నే నా చిరునామా’ పుస్తకాలు ఆవిష్కరించి మాట్లాడారు. పాతికేళ్లుగా సాహిత్య సృజనను ఒక సామాజిక  బాధ్యతగా  నిర్వహిస్తున్న కవి, గాయకుడు వెంకన్న తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తి అనేక పాటలు పా డి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడన్నారు. అలుగెల్లిన పాట వ్యాస సంపుటి ఒక గొప్ప పరిశోధన గ్రంథమని పేర్కొ న్నారు. సుద్దాల హనుమంతు మొదలుకొని 42మంది తెలంగాణ కవుల జీవితాన్ని వడపోసిన గొప్ప గ్రంథమని అన్నారు. డాక్టర్‌ పగడాల నాగేందర్‌ అధ్యక్షతన నిర్వహించిన సభలో సాహితీ వేత్తలు, కవులు, రచయితలు మునాస వెంకట్‌, నారాయణ, ఎలికట్టె శంకర్‌రావు, పెరమాళ్ల ఆనంద్‌, కృష్ణారెడ్డి, అంబటి వెంకన్న, సాగర్ల సత్త య్య, అంజయ్య, లేఖానందస్వామి, వెంకటేశం, ఎల్లయ్య, వెంకలయ్య, గోపి, కత్తుల శంకర్‌, డప్పు శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-19T06:03:24+05:30 IST