శ్యాంప్రసాద్‌ ముఖర్జికి ఘన నివాళి

ABN , First Publish Date - 2021-06-24T04:47:24+05:30 IST

బీజేపీ నేత శ్యాంప్రసాద్‌ముఖర్జి వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా బుధవారం బీజేపీ నాయకులు ఆయన చిత్రపటాల వద్ద నివాళులు అర్పించారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని నాయకులు పిలుపునిచ్చారు.

శ్యాంప్రసాద్‌ ముఖర్జికి ఘన నివాళి
మంచిర్యాలలో శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న బీజేపీ నాయకులు

బీజేపీ నేత శ్యాంప్రసాద్‌ముఖర్జి వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా బుధవారం బీజేపీ నాయకులు ఆయన చిత్రపటాల వద్ద నివాళులు అర్పించారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఏసీసీ, జూన్‌ 23: జనసంఘ్‌ వ్యవస్థాపకులు శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జి వర్ధంతి (బలిదాన్‌ దివస్‌)ను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ  కార్యాలయంలో నాయకులు బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘు మాట్లాడారు. భారతదేశంలో వేర్వేరు రాజ్యాంగాలు ఉండకూడదని, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగాన్ని కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేయాలని నెహ్రూ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి శ్యామ్‌ప్రసాద్‌ మముఖర్జి  డిమాండ్‌ చేశారని తెలిపారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్‌, హరికృష్ణ, తులా మధుసూదన్‌రావు, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
చెన్నూరు: శ్యాంప్రసాద్‌ ముఖర్జి వర్ధంతిని పురస్కరించుకుని బొక్కలగూడెంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి నగు నూరి వెంకటేశ్వర్‌గౌడ్‌, చెన్నూరు టౌన్‌ ప్రెసిడెంట్‌ సుశీల్‌కుమార్‌, జిల్లా కార్యదర్శి జూల లక్ష్మణ్‌, పట్టణ ఉపాధ్యక్షుడు కొంపెల్లి బానేష్‌, నాయకులు శ్రీనివాస్‌, అక్షిత్‌శర్మ, అమర్‌శెట్టి, రమేష్‌ పాల్గొన్నారు.
మందమర్రిటౌన్‌: భారతీయ సంఘ్‌ వ్యవస్దాపకులు శ్యాంప్రసాద్‌ ముఖర్జి వర్ధంతి సందర్భంగా పట్టణంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని బీజేపీ పట్టణాధ్యక్షుడు మద్ది శంకర్‌, పట్టణ ఉపాధ్యక్షులు బియ్యాల సమ్మయ్య, అల్లంల నగేష్‌ పిలుపునిచ్చారు. నాయకులు డీవీ దీక్షితులు, రంగు శ్రీనివాస్‌, ఓదెలు, కుమార్‌, దాసరి నిర్మల,  ప్రతాప్‌, దుర్గరాజ్‌, రాజు, మధు, సురేందర్‌, అభిలాష్‌ తదితరులు పాల్గొన్నారు.
మందమర్రిరూరల్‌: మండలంలోని పొన్నారం గ్రామంలో  బీజేపీ నాయకులు శ్యాంప్రసాద్‌ ముఖర్జి  వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు పైడిమల్ల నర్సింగ్‌ శ్యాంప్రసాద్‌ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మొ క్కలు నాటారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి వంజరి వెంకటేష్‌, పవన్‌కుమార్‌, పెంచాల రంజిత్‌, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
హాజీపూర్‌: మండలంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బొలిశెట్టి తిరుపతి, ప్రధాన కార్యదర్శి మేడిపల్లి సత్యం, వివిధ మోర్చాల నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జన్నారం: మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నాయకులు శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జి  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షు డు గోలి చందు, ఉపాధ్యక్షుడు బత్తిని నాగన్నగౌడ్‌, మండల ప్రధాన కార్య దర్శి ఎరుకల రమేష్‌గౌడ్‌, బీజేవైఎం మండల అధ్యక్షుడు ముడుగు ప్రవీణ్‌, జిల్లా నాయకులు మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.
తాండూర్‌: మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జి చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో మొక్కలు నాటారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమాల్లో పార్టీ మండలాధ్యక్షుడు మహీధర్‌ గౌడ్‌, సీనియర్‌ నాయకులు చిలువేరు శేషగిరి, నాయకులు విష్ణు కళ్యాణ్‌, కోమండ్ల శ్రీనివాస్‌, పులగం శ్రీకాంత్‌, అయజ్‌, తాళ్లపల్లి భాస్కర్‌ గౌడ్‌, ఏముర్ల ప్రదీప్‌, నౌనూరి సుధీర్‌ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.
దండేపెల్లి: మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జి వర్ధంతిని నిర్వహించారు. మండలంలోని నెల్కివెంకటాపూర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌రావు హాజరయ్యారు. స్థానిక నాయకులతో కలిసి శ్యాంప్రసాద్‌ ముఖర్జీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు గోపతి రాజయ్య, నాయకులు గాదె శ్రీనివాస్‌, రవి గౌడ్‌, రవీందర్‌, మల్లికార్జున్‌, నరేష్‌, శంకర్‌ గౌడ్‌, నెల్కి మల్లేష్‌, సాయి, వంశీ, వెంకటకృష్ణ రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T04:47:24+05:30 IST