Abn logo
Dec 3 2020 @ 15:42PM

పంటలు, చేపల చెరువులను నిండాముంచిన నివర్ తుఫాన్

నెల్లూరు జిల్లా: నివర్ తుఫాన్ నెల్లూరు జిల్లా రైతులకు కడగండ్లను మిగిల్చింది. వేలాది ఎకరాల్లో పంటలు వరదపాలయ్యాయి. వందల ఎకరాల్లో చేపల చెరువులు నీటమునిగాయి. ఆత్మకూరు నియోజకవర్గం రైతులను నివర్ తుఫాన్ నిండా ముంచింది. భారీ వర్షాల కారణంగా రైతులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. మర్రిపాడు మండలంలో మినుము, మిరప పంటలు నీటమునిగాయి. చేతికొచ్చిన పంటలు నీటమునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సంగం మండలం, కోలగట్ల, తరమల గ్రామాల్లో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ వరదలకు 2వందల ఎకరాల్లో చెరువులు తెగిపోవడంతో చేపలు, రొయ్యలు వరదల్లో కొట్టుకుపోయాయి. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టామని తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయామని ఆక్వా రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement