Abn logo
Aug 2 2021 @ 00:57AM

49.7 శాతం పెన్షన్ల పంపిణీ : కలెక్టర్‌

పాయకాపురం, ఆగస్టు 1 : జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ ప్రక్రియ మొదలైందని, గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దే పెన్షన్‌ మొత్తాన్ని అందజేస్తున్నారని కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 5,06,211 మంది లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి రూ.120.47 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు 49.70 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయిందని, లబ్ధిదారుల చేతికి రూ.59.15 కోట్లు అందించారని వివరించారు. జిల్లాలో అత్యధికంగా మచిలీపట్నం మండలంలో 87.55 శాతం పంపిణీ చేశారని వెల్లడించారు.