పంటను ముంచిన ‘నివర్‌’

ABN , First Publish Date - 2020-11-29T06:18:59+05:30 IST

నివర్‌ తుఫాను రైతులను నిలువునా ముంచింది. చేతికొచ్చిన పంటలు నీటి పాలయ్యాయి. పప్పుశనగ, వరి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షంతో పాటు చలిగాలుల తీవ్రత పెరగడంతో పంటలపై ఈప్రభావం కోలుకోలేని దెబ్బతీసింది.

పంటను ముంచిన ‘నివర్‌’
ఉరవకొండ మండలం రాయంపల్లిలో నేలకొరిగిన వరి పంట

పప్పుశనగ, వరి రైతులకు భారీ నష్టం

పుట్లూరు: నివర్‌ తుఫాను రైతులను నిలువునా ముంచింది. చేతికొచ్చిన పంటలు నీటి పాలయ్యాయి. పప్పుశనగ, వరి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షంతో పాటు చలిగాలుల తీవ్రత పెరగడంతో పంటలపై ఈప్రభావం కోలుకోలేని దెబ్బతీసింది. మండలంలోని చాలవేముల గ్రామంలో సుమారు 150 ఎకరాల్లో పప్పుశనగ పంట నీటమునిగినట్లు శనివారం అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. 25 మంది రైతుల పంట నీటమునిగింది.  కొందరు రైతులు పంటలో నిలిచిన నీటిని పంపుసెట్ల ద్వారా బయటకు తోడేందుకు చర్య లు చేపట్టారు. అయినా ప్రయోజనం లేకుండాపోయింది. పంటల్లో ఎక్కువరోజులు నీరునిల్వ ఉంటే చె ట్లు కుళ్లిపోతాయని ఆందోళన చెందుతున్నారు. తుఫాన్‌కు దెబ్బతిన్న పంటను అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లకుండా అంచనా వేశారని రైతులు వాపోతున్నారు.  


నేలకొరిగిన వరి పంట 

కళ్యాణదుర్గం: మండలంలోని నుసికొట్టాల గ్రా మంలో తుఫాన్‌ తాకిడికి కోతకొచ్చిన వరి పంట నేలకొరిగింది. శుక్ర, శనివారాల్లో నివర్‌ ప్రభావంతో మోస్తా రు వర్షాలు కురిసాయి. దీంతో నుసికొట్టాల, పాలవాయి, తిమ్మసముద్రం గ్రామాల్లో సాగుచేసిన వరి పంట దెబ్బతింది.  చేతికొచ్చిన పంట నోటికందేలోగా తుఫాన్‌ తాకిడికి నేలకొరగడంతో తీకళ్యాణదుర్గం: మండలంలోని నుసికొట్టాల గ్రా మంలో తుఫాన్‌ తాకిడికి కోతకొచ్చిన వరి పంట నేలకొరిగింది. శుక్ర, శనివారాల్లో నివర్‌ ప్రభావంతో మోస్తా రు వర్షాలు కురిసాయి. దీంతో నుసికొట్టాల, పాలవాయి, తిమ్మసముద్రం గ్రామాల్లో సాగుచేసిన వరి పంట దెబ్బతింది. చేతికొచ్చిన పంట నోటికందేలోగా తుఫాన్‌ తాకిడికి నేలకొరగడంతో తీవ్రంగా నష్టపోయామని నుసికొట్టాల రైతు మారుతినాయక్‌ వాపోయారు. ఉరవకొండ : వ్రంగా నష్టపోయామని నుసికొట్టాల రైతు మారుతినాయక్‌ వాపోయారు. 

ఉరవకొండ :  నివర్‌ తుఫాన్‌ త్రీవ నష్టాన్ని మిగిల్చింది. మండలంలోని రాయంపల్లిలో 20 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. పంట కోత దశలో నేలకొరిగి నీటమునిగిందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. వరికంకులు దెబ్బతిన్నాయని, గింజలు రాలి యంత్రాలతో కూడా కోత సాధ్యం కాదని వాపోయారు. సుమారుగా రూ.6 లక్షల దాకా ఆస్తినష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. 

యల్లనూరు: మండలంలో సాగుచేసిన వరి పొలాలను నివర్‌ తుఫాన్‌ దెబ్బతీసింది. వరుసగా మూడురోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కోతకొచ్చిన వరిపొలాలు నేలకొరిగాయి. పొలంలో నిలిచిన నీటిపై ధాన్యం పడడంతో మొలకలు వస్తాయని రైతులు వాపోతున్నారు. రెండు, మూడురోజుల్లో కోతలు జరిగి ధాన్యం చేతికొచ్చే దశలో వర్షం కురవడంతో నష్టం చవిచూడా ల్సి వస్తోందన్నారు. నేలకొరిగిన వరిపొలాలను కోయడానికి యంత్రాలతో సాధ్యం కాదని, కూలీల సాయం తో కోయాలంటే అధిక ఖర్చు భరించాల్సి వస్తోందన్నారు. ఈదశలో కోతలు మరింత ఆలస్యమైతే పొలంలోనే గింజలు మొలకలు వస్తాయని అంటున్నారు. మండలవ్యాప్తంగా 1156 ఎకరాల్లో వరిపంట సాగుచేశారు. ఖరీ్‌ఫలో సాగు చేసిన ఈపంట కోతదశకు చేరుకుంది. వ్యవసాయాధికారుల నివేదికల ప్రకారం శనివారం నాటికి మండలంలో 150 ఎకరాల్లో వరి, 50 ఎకరాల్లో పప్పుశనగ పంట దెబ్బతినిందని ఏఓ కాత్యాయిని తెలిపారు.   


కాజ్‌వేల వద్ద అప్రమత్తంగా ఉండాలి

యల్లనూరు మండలంలోని చిత్రావతి నది కాజ్‌వే వద్ద వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ సురే్‌షబాబు హెచ్చరించారు. చిత్రావతి రిజర్వాయర్‌ నుంచి మూడుగేట్ల ద్వారా నీరు దిగువకు వదలినట్లు తెలిపారు. నీరు ఉధృతంగా వస్తుండడంతో కాజ్‌వే దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. శింగవరం, తిమ్మంపల్లి, వెలిదండ్ల రహదారులపై వెళ్లేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 


దెబ్బతిన్న పంటపొలాల పరిశీలన 

తాడిపత్రి రూరల్‌: మండలంలో నివర్‌ తుఫాన్‌ వల్ల దెబ్బతిన్న పొద్దుతిరుగుడు పంట పొలాలను శనివారం రైతుసంఘం తాడిపత్రి కార్యదర్శి రాజారామిరెడ్డి పరిశీలించారు. చల్లవారిపల్లి, జంబులపాడు, వెంకటరెడ్డిపల్లి, ఊరుచింతల, వెంకటాంపల్లి గ్రామా ల్లో ఆయన పర్యటించారు. పలుగ్రామాల్లో పొద్దుతిరుగుడు పంట దెబ్బతినిందన్నారు. వర్షాల వల్ల పూత రాలిపోయి దిగుబడి రాదన్నారు. అధికారులు పంటనష్టంపై అంచనా వేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.


చలి గాలుల తీవ్రతకు 26 గొర్రెల మృతి 

డీ హీరేహాళ్‌: నివర్‌ తుఫాను కారణంగా మండలంలో రెండురోజులుగా కురిస్తున్న వర్షాలకు తోడు చలిగాలుల తీవ్రత పెరిగింది. అధిక చలిని తట్టుకోలేక ఓబుళాపురం గ్రామానికి చెందిన తిప్పయ్య, తిప్పేస్వామికి చెందిన 26 గొర్రెలు మృతి చెందినట్లు పశువైద్యాధికారి రమేష్‌ తెలిపారు. ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.

Updated Date - 2020-11-29T06:18:59+05:30 IST