Abn logo
May 19 2020 @ 13:17PM

నివేద అక్కడా సత్తా చాటుతోందా?

`అల వైకుంఠపురములో..`, `చిత్రలహరి`, `బ్రోచేవారెవరురా` వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ నివేదా పేతురాజ్. సెకెండ్ హీరోయిన్ పాత్రలే అయినప్పటికీ పైన పేర్కొన్న సినిమాలు నివేదకు మంచి గుర్తింపునే తీసుకొచ్చాయి. దీంతో నివేద ప్రస్తుతం లీడ్ హీరోయిన్‌గా వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. యంగ్ హీరో రామ్ `రెడ్`తోపాటు సాయితేజ్-దేవకట్టా సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది. 


మరోవైపు తమిళంలో కూడా నివేదకు మంచి అవకాశాలే వస్తున్నాయి. కోలీవుడ్‌లోనే కెరీర్ ప్రారంభించిన నివేదకు అక్కడా ఛాన్సులు బాగానే వస్తున్నాయట. కాగా, మలయాళంలో కూడా నివేద సత్తా చాటాలని ప్రయత్నిస్తోందట. తాజాగా దుల్కర్ సల్మాన్ సినిమాలో ఛాన్స్ నివేదను వరించింది. లాక్‌డౌన్ తర్వాత నివేదకు మలయాళం నుంచి మరిన్ని ఛాన్సులు రాబోతున్నాయట. ఇటీవల నివేద హాట్ ఫొటోషూట్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. 

Advertisement
Advertisement
Advertisement