నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు

ABN , First Publish Date - 2021-08-31T17:30:55+05:30 IST

నిజామాబాద్: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు

నిజామాబాద్: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండే దశకు చేరుకుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. దీంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. దర్పల్లి, భీంగల్, తిరుకొండ ప్రాంతాల్లో మొదలయ్యే వాగు అన్ని ప్రాంతాల్లో పూర్తిగా నిండి రోడ్లపై పారుతోంది. దీంతో అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.  అయితే ఈ జలకలను చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు.

Updated Date - 2021-08-31T17:30:55+05:30 IST