నిండుకుండలా నిజాంసాగర్‌ ప్రాజెక్టు

ABN , First Publish Date - 2020-10-23T11:38:36+05:30 IST

ఈ నెల 15వ తేదీ నుంచి నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వర ద నీటిని మంజీరా నదిలోకి వదులుతున్నారు.

నిండుకుండలా నిజాంసాగర్‌ ప్రాజెక్టు

నిజాంసాగర్‌, అక్టోబరు 22: ఈ నెల 15వ తేదీ నుంచి నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వర ద నీటిని మంజీరా నదిలోకి వదులుతున్నారు. గురువారం మంజీ రా నది వెంట 4,047 క్యూసెక్కుల వరద నీరు వస్తూనే ఉంది. దీంతో నీటి పారుదల శాఖ అధికారులు వీఏఆర్‌ నెంబర్‌ 5లోని ఒక గేటును ఎత్తి మంజీరా నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు లో 1,405 అడుగుల పూర్తి నీటి సామర్థ్యం కలిగి ఉంది. ప్రాజె క్టుపైన పర్యాటకులు వస్తూనే ఉన్నారు. నిండుకుండలా ఉన్న నిజాం సాగర్‌ను చూసి ఆనందోత్సావాల్లో మునిగిపోతున్నారు. సింగూరు ప్రాజెక్టు నుంచి 5,990 క్యూసెక్కుల నీరు సింగూరులోకి వస్తుండటంతో 3,213 క్యూసె క్కుల నీటిని మంజీరా నదిలోనికి వదులుతున్నారు. సింగూరు ప్రాజెక్టు 523.600 మీటర్ల పూర్తి నీటి సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం 29.917 టీఎంసీల నీరు నిల్వ చేస్తూ మిగతా నీటిని మంజీరాలోకి వదులుతు న్నట్లు ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు.


వరద గేట్లకు కరెంట్‌ కనెక్షన్‌ ఇవ్వరా?

నిజాంసాగర్‌ ప్రాజెక్టు వరద గేట్లలోని 20 గేట్లకు కరెంట్‌ కనెక్షన్‌ ఇవ్వలేక పోయారు. వరద గేట్లు చిమ్మ చీకట్లోనే ఉన్నాయి. గత సెప్టెంబరులో వరద గేట్లను పరిశీలించిన గోదావరి బేసిన్‌ కమిషనర్‌ మధుసూదన్‌రావు వెంటనే వరద గేట్లకు కరెంట్‌ కనెక్షన్‌ ఇప్పించాలని ఆదేశాలిచ్చారు. నీటి పారుదల శాఖాధికారులు ఉన్నతాధికారుల ఆదేశా లను బేఖాతర్‌ చేశారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి దాదాపు 50 టీఎంసీల నీటిని మంజీరా నదిలోనికి వదిలివేసిన విషయం విధితమే. నిజాంసాగర్‌కున్న 48 గేట్లలోని 20 గేట్లకు 1979లో విద్యుత్‌తో గేట్లను ఎత్తేందుకు కనెక్షన్లు ఇచ్చారు.


కాల క్రమేణా ఈ వరద గేట్లకు విద్యుత్‌ సరఫరాలో సాంకేతిక లోపం రావడంతో గత పదేళ్లుగా విద్యుత్‌ కనెక్షన్‌ లేకుండా పోవడం గమనార్హం. నిజాంసాగర్‌ ప్రాజెక్టుపైన వీఏఆర్‌ నెం బర్‌ 5 వద్ద నీటి పారుదల శాఖ అధికారులు వరద గేట్ల లీకేజీలను అరికట్టేందుకు కంకర, మట్టిని తీసుకుని వచ్చారు. ఈ మట్టి కంకరను పక్కకు వేయకుండా వరద గేట్ల రోడ్డుపైనే వేయడంతో పర్యాటకులు అనేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఉన్నతాధికారులు సైతం నిజా ంసాగర్‌ ప్రాజెక్టును పరిశీలిస్తూ ఇక్కడే మకాం వేస్తున్నా కంకరతో పర్యాటకులు పడే పాట్లు గమనించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీఏఆర్‌ నెంబర్‌ 5 వద్ద ఉన్న కంకరను తొలగిం చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - 2020-10-23T11:38:36+05:30 IST