డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్‌ అరెస్ట్

ABN , First Publish Date - 2020-10-20T16:32:44+05:30 IST

హైదరాబాద్: నగరంలోని వెస్ట్ జోన్ పరిధిలో డ్రగ్స్ కలకలం రేపాయి.

డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్‌ అరెస్ట్

హైదరాబాద్: నగరంలోని వెస్ట్ జోన్ పరిధిలో డ్రగ్స్ కలకలం రేపాయి. సిటీ యూత్‌ను టార్గెట్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్‌ను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టూడెంట్ వీసా మీద హైదరాబాద్‌కు వచ్చిన డానియల్ అనే నైజీరియన్.. ఇక్కడ చదువుతూనే డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కాగా.. డానియల్ లంగర్ హౌజ్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పక్కా సమాచారంతో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 6 గ్రాముల కోకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. పోలీసులు డానియల్‌పై కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-10-20T16:32:44+05:30 IST